Etela Rajender: రైతులకు భరోసా.. భద్రత ఇచ్చేందుకే అమిత్‌షా వచ్చారు
Etela Rajender: బీజేపీ వల్లే బంగారు తెలంగాణ సాకారం
Etela Rajender: రైతులకు భరోసా.. భద్రత ఇచ్చేందుకే అమిత్‌షా వచ్చారు
Etela Rajender: రైతులకు భరోసా, భద్రత ఇచ్చేందుకే అమిత్‌షా వచ్చారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ అన్నారని.... కానీ నాలుగున్నరేళ్లుగా రైతు రుణమాఫీ చేయలేదని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో భూములు అమ్ముకుంటున్నారని.. ఎన్నికలు వస్తున్నాయనే రుణమాఫీ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. భూముల విక్రయం ద్వారా వచ్చిన డబ్బుతో రుణమాఫీ చేయాలని చూస్తున్నారని చెప్పారు. రైతు పండించిన పంటలను కొనుగోలు చేయట్లేదని.. పేదల సొంతింటి కల నెరవేరలేదన్నారు.