Maheshwar Reddy: రేవంత్ రెడ్డికి హాలిడే పీరియడ్ ముగిసింది.. త్వరలో సీఎం పోస్టు ఖాళీ...
Alleti Maheshwar Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
Maheshwar Reddy: రేవంత్ రెడ్డికి హాలిడే పీరియడ్ ముగిసింది.. త్వరలో సీఎం పోస్టు ఖాళీ...
Alleti Maheshwar Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ చేస్తూ రేవంత్ రెడ్డికి హాలిడే పీరియడ్ ముగిసిందన్నారు. త్వరలో సీఎం పోస్ట్ ఖాళీ కానుందన్నారు. సీఎం పదవికి ఆశావాహులు పోటీ పుడతున్నారని చెప్పారు. ఇందు కోసం కాంగ్రెస్ పార్టీ ముమ్మర కసరత్తు చేస్తుందన్నారు. రేవంత్ కు రాహుల్ గాంధీ కనీసం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు.
మూసి ప్రాజెక్టు వ్యయాన్ని 50 వేల కోట్ల వ్యయాన్ని లక్షన్నర కోట్ల రూపాయలకు పెంచారని ఆరోపించారు. ఇందులో భారీగా స్కాం జరగబోతుందని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని దూరం పెట్టిందన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారని.. ఎదురుతిరుగుతున్నారని చెప్పారు. బయటకు చెప్పలేని వాళ్ల చెవులు కొరుకుంటున్నారని .. కొందరు గ్రూపులు కడుతున్నారని.. మరికొందరు ఏకపక్ష దోరణిని వ్యతిరేకిస్తున్నారని మహేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు.