Koti: వేలాదిగా చేరుకున్న మహిళలు.. కోఠిలో ఆశా వర్కర్ల ఆందోళన
Koti: కోఠి ఉమెన్స్ కాలేజీ నుంచి డీఎంహెచ్ఓ ఆఫీస్ వరకు రోడ్డుపై బైఠాయింపు
Koti: వేలాదిగా చేరుకున్న మహిళలు.. కోఠిలో ఆశా వర్కర్ల ఆందోళన
Koti: హైదరాబాద్ కోఠిలో ఆశా వర్కర్లు కదం తొక్కారు. కోఠి ఉమెన్స్ కాలేజీ నుంచి డీఎంహెచ్‌వో ఆఫీస్ వరకు రోడ్డుపై బైఠాయించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. రోడ్లు బ్లాక్ చేసి బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు.
కార్యాలయ గేటు ముందు రోడ్డుపై ఆశా వర్కర్లు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆశా వర్కర్ల సమ్మె 19వ రోజులో భాగంగా తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్ల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆందోళన చేపట్టారు. పారితోషికాన్ని 18వేలకు పెంచి ... ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ.ఎస్.ఐ, పి.ఎఫ్ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించి... రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5లక్షలు ఇవ్వాలని కోరుతున్నారు. తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని ఆశా వర్కర్స్ హెచ్చరించారు.