Addanki Dayakar: మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోంది
Addanki Dayakar: హిందుత్వాన్ని బీజేపీకి కట్టబెట్టలేదు
Addanki Dayakar: మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోంది
Addanki Dayakar: మతం పేరుతో బీజేపీ రాజకీయం చేయాలనుకుంటుందన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. హిందుత్వాన్ని బీజేపీకి కట్టబెట్టలేదన్నారు. తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని...బీజేపీ, టీఆర్ఎస్ కలిసి.. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాయన్నారు. తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మాత్రమే ఉన్నాయని చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఎంఐఎం, టీఆర్ఎస్ ప్రత్యక్ష మిత్రులు అయితే.., బీజేపీ, టీఆర్ఎస్ పరోక్ష మిత్రులని విమర్శించారాయన.