హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
Hyderabad: శామీర్‌పేట దగ్గర లారీ, బొలేరో వాహనం ఢీ
హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు
Hyderabad: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లినానియా రిసార్ట్ దగ్గర ఔటర్‌పై వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్ ఎక్కింది. ఎదురుగా వచ్చే వాహనాలపైకి దూసుకెళ్లి.. బొలేరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌తో పాటు బొలేరో వాహనంలోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.