Shiva Balakrishna: శివ బాలకృష్ణ బినామీలను విచారించిన ఏసీబీ
Shiva Balakrishna: బినామీల విచారణ పూర్తైతే మరిన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చే అవకాశం
Shiva Balakrishna: శివ బాలకృష్ణ బినామీలను విచారించిన ఏసీబీ
Shiva Balakrishna: HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. శివ బాలకృష్ణ బినామీలు అయిన డ్రైవర్ గోపి, అటెండర్ హబీబ్, సత్యనారాయణ, భరత్‌ను విచారించారు అధికారులు. శివబాలకృష్ణ డ్రైవర్ గోపి పేరుతో హోండా సిటీ కారు గిఫ్ట్‌గా వచ్చినట్టు గుర్తించారు. భరత్‌కుమార్ పేరుపై నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరులో 13 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు శివబాలకృష్ణ. సత్యనారాయణ మూర్తి పేరుపై భారీగా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసినట్టు అనుమానిస్తున్నారు అధికారులు. శివబాలకృష్ణ బినామీల విచారణ పూర్తైతే మరిన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.