HYD News: పెళ్లి చూపుల్లో అడ్డంగా దొరికిపోయిన లేడీ ఎస్ఐ

HYD News: పెళ్లి సంబంధాల కోసం ఎస్‌ఐ అవతారం ఎత్తిన యువతి

Update: 2024-03-19 11:41 GMT

HYD News: పెళ్లి చూపుల్లో అడ్డంగా దొరికిపోయిన లేడీ ఎస్ఐ

HYD News: ఏడాదిగా నకిలీ ఆర్‌.పీ.ఎఫ్. ఎస్.ఐగా చెలామణి అవుతున్న మాళవికను పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో ఆర్.పీ.ఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసి దాదాపు అన్ని అర్హతలు సాధించింది. మెడికల్ చెకప్‌లో దృష్టి లోపం కారణంగా తిరస్కరణకు గురైంది. అప్పటికే తల్లిదండ్రులతో పాటు బంధువులకు తాను ఎస్ఐ అవుతున్నట్లు చెప్పుకుంది. తన పరువు పోతుందని భావించిన మాళవిక ఎస్ఐ యూనిఫాం కుట్టించుకోవడంతోపాటు నకిలీ ఐడీ కార్డు చేయించుకుని ఎస్‌ఐగా చెలామణి అవుతుంది. ఈ క్రమంలో పెళ్లి సంబంధాలు చూసేందుకు ఆ యువతి యూనిఫామ్‌లో వెళ్లింది. అయితే అబ్బాయి తరపు బంధువులు పైఅధికారులను సంప్రదించగా... మోసం బయటపడింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మాళవికను అరెస్టు చేసినట్లు సికింద్రాబాద్ రైల్వే ఎస్.పి సలిమా వెల్లడించారు.

Tags:    

Similar News