Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డి బృందానికి జ్యురిచ్‌లో ఘన స్వాగతం

Revanth Reddy: వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ప్రెసిడెంట్‌ బార్గేతో సమావేశం

Update: 2024-01-16 04:11 GMT

Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డి బృందానికి జ్యురిచ్‌లో ఘన స్వాగతం

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ లో అడుగుపెట్టారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో దావోస్ వెళ్లిన రేవంత్ రెడ్డి బృందానికి జ్యురిచ్ విమానాశ్రయంలో పలువురు భారతీయ ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు. సమగ్ర అభివృద్ధితో కూడిన సరికొత్త తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ప్రవాస భారతీయులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. వారితో మాట్లాడటం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో ‘పెట్టుబడులు పెట్టండి’ అనే ప్రచారం ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు.

Tags:    

Similar News