Kukatpally: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
Kukatpally: జేఎన్టీయూ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
Kukatpally: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం
Kukatpally: కూకట్ పల్లి జేఎన్టీయూ ప్రధాన రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. సకాలంలో బస్సులో ఉన్న వారు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో లో ట్రావెల్స్ బస్సుల్లో భద్రతా డొల్లతనం తేటతెల్లం అయ్యింది. హైదరాబాద్ కూకట్ పల్లి జేఎన్టీయూ వద్ద కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమయ్యింది. అయితే ఘటన జరిగిన సమయంలో బస్సులో 17 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ఇంజన్ లో మంటలు వ్యాపించిన సమయంలో డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు.
క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి .అయితే మంటలు మొదలవ్వగానే స్థానికుల సహాయంతో ప్రయాణీకులు బస్సులో నుంచి కిందికి దిగటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలను అదుపు చేసింది.అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇక ఈ ఘటనతో జేఎన్టీయూ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఒకవేళ ప్రమాదం రాత్రి జరిగి ఉంటే పెద్ద మొత్తం లో ప్రాణ నష్టం సంభవించేది. ఏదేమైనా మరోసారి ప్రైవేట్ ట్రావెల్స్ భద్రతా లోపాలు బట్ట బయలు అయ్యాయి. ఘటన జరిగే సమయంలో హడావిడి చేసే అధికారులు తర్వాత చూసీ చూడనట్టు వ్యవహరిస్తుండటం తోనే ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవతున్నాయి.