Viral News: చెరువులో డెడ్​బాడీ ఉందన్న జనాలు.. వచ్చి చూస్తే...

మద్యం మత్తులో చెరువులో సేదతీరిన ఓ వ్యక్తి

Update: 2024-06-11 06:27 GMT

హన్మకొండ జిల్లా రెడ్డిపురంలో పోలీసులకు షాకిచ్చిన వ్యక్తి 

Viral News: హన్మకొండ జిల్లా రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి పోలీసులకు షాక్ ఇచ్చాడు. మద్యం మత్తులో చెరువు నీటిలో తేలియాడుతూ మంచి నిద్రలోకి జారుకున్నాడు. అయితే చెరువులో ఆ వ్యక్తిని గమనించిన స్థానికులు డెడ్‌బాడీ అనుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న వారికి ఊహించని షాక్ ఇచ్చాడు ఆ వ్యక్తి. పోలీసులు ఆ వ్యక్తి చేయి పట్టుకుని లాగుతున్న సమయంలో ఒక్కసారిగా లేవడంతో అక్కడున్న వారందరూ అవాక్కయ్యారు. ఇక ఆ వ్యక్తిని విచారించి నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా ఐడెంటిఫై చేశారు. అయితే 10 రోజుల నుంచి గ్రానైట్ క్వారీలో 12 గంటల సేపు ఎండలో పనిచేశానని.. ఎండ వేడిమి తట్టుకోలేకనే నీటిలో పడుకున్నట్లు చెప్పాడు.

Tags:    

Similar News