Vikarabad: రైలు, ప్లాట్ ఫామ్‌కు మధ్యలో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు.. రెండు గంటల పాటు నరకయాతన
Vikarabad: ప్లాట్‌ఫామ్ పగలగొట్టి బయటకు తీసిన సిబ్బంది
Vikarabad: Vikarabad: రైలు, ప్లాట్ ఫామ్‌కు మధ్యలో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు.. రెండు గంటల పాటు నరకయాతన
Vikarabad: రన్నింగ్ ట్రైన్‌లు ఎక్కేందుకు ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు తొందరపాటులో ఆ తప్పులు చేస్తూ ఇబ్బందుల పాలవుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.
వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు ప్లాట్ ఫామ్‌పైకి వచ్చే సమయానికే ట్రైన్ కదిలింది. దాంతో ట్రైన్ ఎక్కాలన్న తొందరతో ఆ వ్యక్తి రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు వెళ్లాడు. పట్టుతప్పి రైలుకి, ప్లాట్‌ఫామ్‌కి మధ్యలో ఇరుక్కుపోయాడు. బయటకు వచ్చేందుకు ప్రయత్నించినా కుదరలేదు. దాంతో ట్రైన్ అతన్ని కాస్త దూరం లాక్కెళ్లింది.
ప్రయాణికుడు పడిపోయిన విషయాన్ని గమనించిన సిబ్బంది వెంటనే రైలును ఆపేశారు. అతన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. రెండు గంటల పాటు శ్రమించి.. ప్లాట్‌ఫామ్‌ను పగలగొట్టి అతన్ని బయటకు తీశారు. తీవ్రగాయాలవడంతో ఆ ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వ్యక్తి రాయచూర్‌కు చెందిన సతీష్‌గా గుర్తించారు రైల్వే పోలీసులు.