Madhapur Drug Case: మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం.. నిందితుడు వెంకట్ లీలలు మామూలుగా లేవుగా..?
Madhapur Drug Case: ఎన్‌ఐఆర్‌గా చెప్పుకుంటూ విదేశీ యువతకు సైతం టోకరా
Madhapur Drug Case: మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొత్త కోణం.. నిందితుడు వెంకట్ లీలలు మామూలుగా లేవుగా..?
Madhapur Drug Case: మాదాపూర్ డ్రగ్స్ కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. అరెస్టయిన వెంకటరత్నారెడ్డి అక్రమాలపై నార్కోటిక్ అధికారులు ఆరా తీస్తున్నారు. వెంకట్‌పై తెలుగు రాష్ట్రాల్లో 25కి పైగా కేసులు నమోదయ్యాయి. ఐఆర్ఎస్ అధికారినంటూ మోసాలకు పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. ఐఆర్ఎస్ అధికారిగా చెలామణి అవుతూ నిర్మాతలు సి.కళ్యాణ్, రమేష్‌ల నుంచి వసూళ్లకు పాల్పడ్డట్లు గుర్తించారు. నిర్మాతల నుంచి ముప్పై లక్షలకు పైగా వెంకటరత్నారెడ్డి వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
మరో వైపు అమ్మాయిలను కూడా సినిమా అవకాశాల పేరిట వల విసిరి మోసం చేశాడు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తాను ఎన్‌ఆర్‌ఐ అంటూ పెళ్లి పేరుతో విదేశీ యువతను కూడా మోసం చేసినట్లు గుర్తించారు. ఏపీకి చెందిన ఓ ఎంపీ పేరు చెప్పి వసూళ్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇలా ఒక్కటనే కాదు అనేక రకాల స్కామ్‌లలో వెంకటరత్నారెడ్డి హస్తముందని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ, సినీ, రాజకీయ నాయకులను బురిడీలు కొట్టిస్తున్నాడు. దీంతో వెంకటరత్నారెడ్డి కాంటాక్ట్‌లో ఉన్నవాళ్లందరినీ ప్రశ్నించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.