కరీంనగర్‌లో దారుణం.. ఓ మైనర్ బాలికపై ఏడాదిగా లైంగిక దాడి
Karimnagar: యువతిని నిత్యం లైంగికంగా వేధిస్తున్న ముగ్గురు యువకులు
కరీంనగర్‌లో దారుణం.. ఓ మైనర్ బాలికపై ఏడాదిగా లైంగిక దాడి
Karimnagar: కరీంనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్న యువకుల దుర్మాగం వెలుగుచూసింది. వీడియో రికార్డు చేసి మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుపోలీసులకు సమాచారం అందింది. యువతిని నిత్యం ముగ్గురు యువకులు లైంగికంగా వేధిస్తుండగా, మరో ముగ్గురు లైంగిక వేధింపులకు గురిచేయడంతో వ్యవహారం బయటపడింది.
కరీంనగర్ వన్‌టౌన్‌లో బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు మొత్తం ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఐదుగురు మైనర్లు, డిప్లమా చేస్తున్న మరో యువకుడు ఉన్నాడు. పట్టుబడిన నిందితులపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.