Hyderabad: ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు
Hyderabad: మీర్‌చౌక్ ట్రాఫిక్ ఎస్‌ఐ గణేశ్ వేధింపులే... ఆత్మహత్యకు కారణమని మృతుడు సూసైడ్ నోట్
Hyderabad: ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు
Hyderabad: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమయ్యాయి. చలాన్లు పెండింగులో ఉండడంతో మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన ఓ హమాలీ అత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు మీర్‌చౌక్ ట్రాఫిక్ ఎస్‌ఐ గణేశ్ వేధింపులే కారణమని మృతుడు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.
ఉపాధి కోసం నగరానికి వచ్చిన నల్గొండ జిల్లాకు చెందిన ఎల్లయ్య సైదాబాద్‌లోని నీలం సంజీవరెడ్డినగర్‌లో నివాసం ఉంటున్నాడు. హమాలీగా పనిచేస్తున్నాడు. పలు ఛలాన్లు పెండింగ్ ఉండడంతో ఎల్లయ్య బైక్‌ను మీర్‌చౌక్ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఎల్లయ్య ఇంటికి వచ్చిన అనంతరం విషం తాగాడు.
గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఓ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఎల్లయ్య మరణించాడని అక్కడి వైద్యులు ధృవీకరించారు. కాగా ముందుగా కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని చూపించే ప్రయత్నం చేశారు సైదాబాద్ పోలీసులు.. అయితే ఎల్లయ్య రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి రావడంతో పోలీసులు కేసును మార్చారు. ఎల్లయ్యను వేధించిన మీర్‌చౌక్ ట్రాఫిక్ ఎస్ఐ గణేష్‌పై చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.