క్రమశిక్షణ లేని వ్యక్తికి క్రమశిక్షణా కమిటీ ఇచ్చారు : శంకర్ ప్రసాద్
Shankar Prasad: నేను కోవర్టు అని నిరూపిస్తే ఉరి వేసుకుంటా
క్రమశిక్షణ లేని వ్యక్తికి క్రమశిక్షణా కమిటీ ఇచ్చారు : శంకర్ ప్రసాద్
Gandhi Bhavan: గాంధీభవన్ ముందు వనపర్తి కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ డీసీసీ శంకర్ ప్రసాద్‌ను క్రమ శిక్షణా కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి ఏకపక్షంగా పార్టీ నుంచి బహిష్కరించారంటూ నిరసన చేపట్టారు. చిన్నారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాను కోవర్టు అంటూ ఆరోపణలు చేశారని నిరూపిస్తూ గాంధీ భవన్ ముందే ఉరి వేసుకుంటానని శంకర్ ప్రసాద్ సవాల్ విసిరారు. క్రమశిక్షణ లేని వ్యక్తిని ఆ కమిటీకి ఛైర్మన్ చేశారని విమర్శించారు.