Kishan Reddy: ఆగష్టు 15న మీ దేశభక్తిని చాటండి..
Kishan Reddy: 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించాలని
Kishan Reddy: ఆగష్టు 15న మీ దేశభక్తిని చాటండి..
Kishan Reddy: 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా త్యాగధనుల గురించి తెలుసుకునేలా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలను భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. ఆగస్టు 2న పింగళి వెంకయ్య శత జయంతి వేడుకలను ఢిల్లీలో నిర్వహిస్తామన్నారు.ఆగస్టు 13 నుంచి 15వరకు దేశంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని కిషన్ రెడ్డి కోరారు. హర్ ఘర్ తిరంగా ఘర్ ఘర్ తిరంగా పేరుతో కార్యక్రమాలు రూపొందించామని చెప్పారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఇళ్లపై జెండా ఎగురవేయాలని ఆయన కోరారు. అయితే ప్రతి ఒక్కరు స్వయంగా జెండా కొనుక్కుని ఎగురవేయాలని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆగస్ట్ 14న రాత్రి అందరూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలన్నారు.ఆగస్టు 15న మహనీయుల విగ్రహాల వద్ద నివాళులర్పించాలని తెలిపారు.