తెలంగాణలో 6వ రోజు రాహుల్ భారత్‌ జోడోయాత్ర

*సాయంత్రం 4గంటలకు తిరిగి ప్రారంభం కానున్న యాత్ర

Update: 2022-10-31 04:54 GMT

తెలంగాణలో 6వ రోజు రాహుల్ భారత్‌ జోడోయాత్ర

Bharat Jodo Yatra: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఆరో రోజు మొదలైంది. భారత్ జోడో యాత్ర ఇవాళ 28కిలోమీటర్ల మేర సాగనున్నది. షాద్‌ నగర్‌ నుంచి రాహుల్‌ యాత్ర ప్రారంభమైంది. ఇవాళ 28 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగనుంది. షాద్‌నగర్‌ నుంచి ముచ్చింతల్‌ దగ్గర పెద్దషాపూర్‌ వరకు యాత్ర నిర్వహించనున్నారు. కొత్తూరులో మధ్యాహ్న భోజన విరామం. సాయంత్రం 7 గంటలకు ముచ్చింతల్ దగ్గర రాహుల్‌గాంధీ సభ జరగనుంది. రాత్రికి శంషాబాద్‌ శివారు తండుపల్లి దగ్గర బస చేయనున్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాటు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

రాహుల్ పాదయాత్ర కన్యాకుమారి నుంచి 54 రోజులుగా కొనసాగుతుంది. వివిధ వర్గాల సమస్యలను తెలుసుకుంటూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. బీజేపీపై రాహుల్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. విద్యా సంస్థల ప్రయివేటీకరణకు చెక్ పెడతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ధరణి పోర్టల్ ను మెరుగు పరుస్తామని చెప్పారు. 

Full View


Tags:    

Similar News