నల్గొండ జిల్లాలో భారీగా పట్టుబడ్డ 330 కేజీల గంజాయి
Nalgonda: 168 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న సాగర్ పోలీసులు
నల్గొండ జిల్లాలో భారీగా పట్టుబడ్డ 330 కేజీల గంజాయి
Nalgonda: నల్గొండ జిల్లా అంతర్‌రాష్ట్ర చెక్‌పెస్ట్ దగ్గర భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. నాగార్జున సాగర్, ఏపీ చెక్‌పోస్ట్‌లో తనిఖీలు చేపట్టిన పోలీసులు 330 కేజీల గంజాయిని 168 ప్యాకెట్లను పట్టుకున్నారు. గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు నాగార్జున సాగర్ పోలీసులు. కాగా.. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు .. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.