Breaking News: తెలంగాణలో టెన్త్‌ పరీక్షలు రద్దు.. ఇంటర్ ఎగ్జామ్స్‌‌..

Breaking News: తెలంగాణలో ఈ ఏడాది కూడా టెన్త్‌ పరీక్షలు రద్దయ్యాయి. అలాగే, ఇంటర్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేశారు.

Update: 2021-04-15 13:15 GMT

Breaking News: తెలంగాణలో ఈ ఏడాది కూడా టెన్త్‌ పరీక్షలు రద్దయ్యాయి. అలాగే, ఇంటర్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేశారు. కరోనా సెకండ్ వేవ్‌ విజృంభణతో తెలంగాణ సర్కారు టెన్త్‌ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఈసారి టెన్త్ ఎగ్జామ్స్‌ను మాత్రమే రద్దుచేసి ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది.

కరోనా కారణంగా సీబీఎస్‌ఈ టెన్త్‌ పరీక్షలను కేంద్రం రద్దు చేయడంతోపాటు 12వ తరగతి ఎగ్జామ్స్‌ను వాయిదా వేయడంతో తెలంగాణ ప్రభుత్వం అదే బాటలో అడుగులు వేసింది. కేసులు ఉధృతి ఎక్కువగా ఉండటంతో టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహించే పరిస్థితుల్లేవని తెలంగాణ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. టెన్త్ పరీక్షలు రద్దు, ఇంటర్ పరీక్షలను వాయిదా వేస్తూ విద్యాశాఖ పంపిన ఫైల్‌పై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.

Tags:    

Similar News