CM KCR: కొండగట్టు అంజన్నకు రూ. 100 కోట్లు.. త్వరలోనే కొండగట్టుకు వెళ్లి పనులు ప్రారంభిస్తా..
CM KCR: జగిత్యాల పర్యటనలో సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయంతో పాటు పలు అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
CM KCR: కొండగట్టు అంజన్నకు రూ. 100 కోట్లు.. త్వరలోనే కొండగట్టుకు వెళ్లి పనులు ప్రారంభిస్తా..
CM KCR: జగిత్యాల పర్యటనలో సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయంతో పాటు పలు అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. కొండగట్టు అంజన్న సన్నిధికి హనుమాన్ భక్తులు లక్షల సంఖ్యలో తరలివస్తున్నారు. అంజన్న దేవస్థానం కేవలం 20 ఎకరాల్లో మాత్రమే ఉండేది. 384 ఎకరాల స్థాలాన్ని దేవాలయానికి ఇచ్చాం. 400 ఎకరాల భూమి కొండగట్టు క్షేత్రంలో ఉంది. కొండగట్టు అంజన్న క్షేత్రానికి రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నాం. త్వరలోనే నేను స్వయంగా వచ్చి ఆగమశాస్త్ర ప్రకారం, భారతదేశంలో సుప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని నిర్మాణం చేయిస్తాను అని హామీ ఇస్తున్నాను అని కేసీఆర్ ప్రకటించారు.