Magnesium Bicycle: దేశంలోనే తొలి మెగ్నీషియం సైకిల్‌.. డ్యూయల్ డిస్క్ బ్రేక్‌తో అదిరిపోయే ఫీచర్లు.. ధరెంతో తెలిస్తే షాకే..!

Strider Magnesium Bicycle: టాటా ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన స్ట్రైడర్ సైకిల్స్ భారతదేశంలో కాంటినో శ్రేణి సైకిళ్లను విడుదల చేసింది. ఇందులో కాంటినో గెలాక్టిక్ 27.5టిని ప్రవేశపెట్టారు.

Update: 2023-09-11 09:30 GMT

Magnesium Bicycle: దేశంలోనే తొలి మెగ్నీషియం సైకిల్‌.. డ్యూయల్ డిస్క్ బ్రేక్‌తో అదిరిపోయే ఫీచర్లు.. ధరెంతో తెలిస్తే షాకే..!

Strider Magnesium Bicycle: టాటా ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన స్ట్రైడర్ సైకిల్స్ భారతదేశంలో కాంటినో శ్రేణి సైకిళ్లను విడుదల చేసింది. ఇందులో కాంటినో గెలాక్టిక్ 27.5టిని ప్రవేశపెట్టారు. ఇది భారతదేశపు మొట్టమొదటి మెగ్నీషియం ఫ్రేమ్ సైకిల్ అని కంపెనీ పేర్కొంది.

కంపెనీ దీని ధరను రూ.27,896గా పేర్కొంది. కాంటినో గెలాక్టిక్ 27.5T దేశవ్యాప్తంగా ఉన్న స్ట్రైడర్ సైకిల్స్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. సైకిల్ మిలిటరీ గ్రీన్, గ్రే రంగులలో అందుబాటులో ఉంది.

మెగ్నీషియం ఫ్రేమ్ ఆఫ్-రోడింగ్‌కు బెస్ట్..

మెగ్నీషియం ఫ్రేమ్‌లు సాంప్రదాయ అల్యూమినియం ఫ్రేమ్‌ల కంటే తేలికగా, బలంగా ఉంటాయి. ఇవి ఆఫ్-రోడింగ్‌కు అనువైనవిగా పరిగణిస్తుంటారు. ఇది కంపనాలను ఎక్కువగా గ్రహిస్తుంది. ఇది రైడింగ్‌ను సౌకర్యవంతంగా చేయడానికి సహాయపడుతుంది.

కాంటినో గెలాక్టిక్ 27.5T ఫీచర్లు..

కాంటినో గెలాక్టిక్ 27.5T అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, స్మూత్ గేర్ షిఫ్టింగ్ కోసం ఫ్రంట్, రియర్ డెరైలర్‌లు, లాక్-ఇన్/లాక్-అవుట్ టెక్నాలజీతో ఫ్రంట్ సస్పెన్షన్ ఫోర్క్ ఉన్నాయి. సైకిల్ గరిష్ట వేగం 21kmph.

Tags:    

Similar News