Samsung Galaxy A56 5G: మరో కొత్త మొబైల్‌ లాంచ్ చేసిన సామ్‌సంగ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇవే..!

Samsung Galaxy A56 5G: సామ్‌సంగ్ గెలాక్సీ A56 5జీ ఫోన్‌లో 6.7-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇందులో సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది.

Update: 2025-03-02 13:56 GMT

Samsung Galaxy A56 5G: సామ్‌సంగ్ ను విడుదల చేసింది. కంపెనీ బడ్జెట్ సెగ్మెంట్‌లో 'Samsung Galaxy A56 5G' ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఫోన్ కంపెనీ ప్రీమియం మొబైల్ గెలాక్సీ ఎస్25ని పోలి ఉంటుంది. ఫోన్ కలర్స్‌లో లాంచ్ అయింది. ఇందులో 12జీబీ ర్యామ్ కూడా ఉంది. ఈ మొబైల్‌ ముందు, వెనుక రెండింటిలో గొరిల్లా గ్లాస్ విక్టస్+ ఉంది. ఈ ఫోన్ ధర, ఫీచర్స్, పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy A56 5G Features

సామ్‌సంగ్ గెలాక్సీ A56 5జీ ఫోన్‌లో 6.7-అంగుళాల ఫుల్ HD ప్లస్ డిస్‌ప్లే ఉంది. ఇందులో సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ స్క్రీన్ 1,080 x 2,340 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్,1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ టెక్నాలజీ ఉంది. అలానే డిస్‌ప్లేకి గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటక్షన్ అందించారు.

ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Exynos 1580 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌ని 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్‌లో తయారు చేశారు. ఫోన్ వన్ UI 7 ఆధారంగా ఆండ్రాయిడ్ 15లో రన్ చేస్తుంది. మొబైల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, 5-మెగాపిక్సెల్ మూడవ కెమెరా ఉన్నాయి. వీడియో కాలింగ్ కోసం 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

సామ్‌సంగ్ గెలాక్సీ A56 5G ఫోన్ 5000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ అందించారు. ఫోన్ ఐ కేర్ స్క్రీన్‌ని ఉపయోగిస్తుంది. ఈ మొబైల్‌లో 3.5మిమీ హెడ్‌ఫోన్ జాక్, USB టైప్ C ఆడియో, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. కనెక్టివిటీ ఎంపికలలో 5GHz Wi-Fi, బ్లూటూత్ 5.3, NFC ఉన్నాయి.

Samsung Galaxy A56 5G Price

ఈ మొబైల్ అద్భుతమైన లైట్ గ్రే, గ్రాఫైట్, ఆలివ్, పింక్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 43,735కి విడుదల చేశారు. అలాగే, 8GB + 256GB స్టోరేజ్ మోడల్‌ను రూ. 48,000కి పరిచయం చేశారు. ఈ సామ్‌సంగ్ ఫోన్‌లో 12జీబీ ర్యామ్ ఉంది. ఫోన్ సామ్‌సంగ్ ఎక్సినోస్ 1580 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ మొబైల్ బాడీ మెటల్‌తో ఉంటుంది. ముందు, వెనుక రెండింటిలో గొరిల్లా గ్లాస్ విక్టస్+ ఉంది.

Tags:    

Similar News