Motorola Signature: మోటొరోలా సిగ్నేచర్... ఫీచర్లు చూస్తే మైండ్ పోతుంది భయ్యా..!

Motorola Signature: ఖరీదైన ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లకే ఇప్పుడు చెమటలు పడుతున్నాయి.

Update: 2026-01-23 11:32 GMT

Motorola Signature: ఖరీదైన ఐఫోన్లు, శాంసంగ్ ఫోన్లకే ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే, ఒకప్పుడు బడ్జెట్ మొబైల్స్‌కే కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న మోటొరోలా, ఇప్పుడు తన రూటు మార్చి ప్రీమియం మార్కెట్‌పై దండయాత్ర మొదలుపెట్టింది. మొబైల్ ప్రపంచంలో సరికొత్త సంచలనానికి తెరలేపుతూ 'మోటొరోలా సిగ్నేచర్' పేరుతో ఒక పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ సిద్ధం చేసింది. స్టైలిష్ లుక్ మాత్రమే కాదు, ఈ ఫోన్ లోపల ఉన్న ఫీచర్లు వింటే టెక్ ప్రియులు నోరెళ్లబెట్టాల్సిందే. పనితీరులోనూ, డిజైన్‌లోనూ ఎక్కడా రాజీ పడకుండా మార్కెట్‌ను షేక్ చేసేందుకు ఇది రంగంలోకి దిగింది.

ఈ ఫోన్ డిస్‌ప్లే చూస్తుంటేనే కళ్లు చెదిరిపోయేలా ఉంది. దీనిలో 6.8 అంగుళాల 1.5K ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ డిస్‌ప్లేను అమర్చారు. కేవలం స్క్రీన్ సైజ్ మాత్రమే కాదు, దీని 165Hz రిఫ్రెష్ రేట్ ఫోన్ వాడకాన్ని వెన్నలా స్మూత్‌గా మారుస్తుంది. ముఖ్యంగా ఎండలో ఫోన్ చూసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏకంగా 6200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను ఇచ్చారు. చేతిలో పట్టుకుంటే చాలా స్లిమ్‌గా, రిచ్‌గా అనిపించేలా మెటల్ ఫ్రేమ్ మరియు గ్లాస్ ఫినిషింగ్‌తో దీనికి ప్రీమియం టచ్ ఇచ్చారు.

వేగం విషయంలోనూ ఇది నెక్స్ట్ లెవల్‌లో ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన చిప్‌సెట్లలో ఒకటైన స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5తో వస్తున్న తొలి ఫోన్లలో ఇది కూడా ఒకటి. భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడినా లేదా ఎన్ని యాప్స్ ఒకేసారి వాడినా ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. దీనిలో 16GB వరకు ర్యామ్, 1TB వరకు భారీ స్టోరేజ్ అందుబాటులో ఉండటం విశేషం. అంతేకాకుండా, లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్‌తో పాటు ఏకంగా ఏడేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇస్తామని మోటొరోలా ప్రకటించడం యూజర్లకు పెద్ద ప్లస్ పాయింట్.

కెమెరా విభాగంలో మోటొరోలా సిగ్నేచర్ ఒక సరికొత్త రికార్డు సృష్టించింది. దీని వెనుక భాగంలో మూడు 50MP కెమెరాల సెటప్‌ను ఇచ్చారు. అంటే మెయిన్ కెమెరా, అల్ట్రావైడ్, పెరిస్కోప్ లెన్స్.. ఇలా అన్నీ కూడా 50MP సామర్థ్యంతోనే ఉంటాయి. దీనివల్ల ఫోటోలు ప్రొఫెషనల్ కెమెరా రేంజ్‌లో వస్తాయి. సెల్ఫీ ప్రియుల కోసం ముందు భాగంలో కూడా 50MP కెమెరానే ఇచ్చారు, దీనివల్ల వీడియో కాల్స్ కూడా చాలా క్లారిటీగా ఉంటాయి. ముఖ్యంగా జూమింగ్ ఫీచర్ ఈ ఫోన్‌లో అద్భుతంగా పని చేస్తుంది.

ఇక బ్యాటరీ విషయానికి వస్తే, 5200mAh భారీ బ్యాటరీని దీనిలో అమర్చారు. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా నిశ్చింతగా ఉండొచ్చు. ఇంతటి అత్యాధునిక ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ధర సుమారు రూ. 59,999 నుండి ప్రారంభమవుతుంది. త్వరలోనే ప్రముఖ ఇ-కామర్స్ సైట్లలో ఇది విక్రయానికి రానుంది. ఫీచర్లు, ధరను బట్టి చూస్తే శాంసంగ్, ఐఫోన్ వంటి బ్రాండ్లకు ఇది గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.

Tags:    

Similar News