Mobile Camera Tips: ఫోన్‌తో ఫొటో తీస్తే అస్పష్టంగా వస్తున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే ఫుల్‌ క్లారిటీ..!

Mobile Camera Tips: కొన్నిసార్లు మొబైల్‌ కెమెరాతో ఫొటోలు తీస్తే స్పష్టంగా రావు. దీనివల్ల చాలామంది స్మార్ట్‌ఫోన్‌ పాతదిగా మారింది కొత్తది కొనాలని ఆలోచిస్తారు.

Update: 2023-10-17 13:30 GMT

Mobile Camera Tips: ఫోన్‌తో ఫొటో తీస్తే అస్పష్టంగా వస్తున్నాయా.. ఈ చిట్కాలు పాటిస్తే ఫుల్‌ క్లారిటీ..!

Mobile Camera Tips: కొన్నిసార్లు మొబైల్‌ కెమెరాతో ఫొటోలు తీస్తే స్పష్టంగా రావు. దీనివల్ల చాలామంది స్మార్ట్‌ఫోన్‌ పాతదిగా మారింది కొత్తది కొనాలని ఆలోచిస్తారు. కానీ ఇది సరైన నిర్ణయం కాదు. ఫోన్‌లో ఫొటోలు క్లారీటీగా రాకపోవడానికి వేరే కారణాలు ఉంటాయి. కానీ వాటిని మనం పట్టించుకోం. మీరు ఆండ్రాయిడ్‌ వినియోగదారు అయితే ఫోన్ కెమెరా నుంచి మెరుగైన ఫొటోలను ఎలా క్లిక్ చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

ఫోన్ లెన్స్ క్లీన్‌ చేయండి

చాలా సార్లు ఫోన్ లెన్స్ క్లీన్‌గా లేకపోతే ఫొటోలు క్లారిటీగా రావు. ఇందుకోసం ముందుగా ఫోన్‌లెన్స్‌ క్లీన్‌ చేయాలి. లెన్స్‌లో దుమ్ము చేరడం వల్ల ఫొటో బ్లర్‌ అవుతుంది. అందుకే తరచుగా లెన్స్ క్లీన్‌గా ఉందా లేదా అనేది చెక్‌ చేయాలి. అది మురికిగా మారితే మైక్రోఫైబర్ క్లాత్‌తో సున్నితంగా క్లీన్‌ చేయాలి.

లైట్ల ప్రభావం

మీరు చీకటిలో ఫొటోలు క్లిక్‌ చేస్తే క్లారిటీ ఉండదు. అందుకే ఫొటోలు తీసేటప్పుడు సరైన వెలుతురు ఉందా లేదా చూసుకోవాలి. సహజమైన పగటి వెలుగులో ఫోటోను క్లిక్ చేస్తే ఫోటో ఫుల్‌ క్లారిటీతో వస్తుంది.

కెమెరా సెట్టింగ్స్‌

ఫొటోలు సరిగ్గా రాకపోవడానికి ఫోన్‌ సెట్టింగ్స్ కూడా కారణమవుతాయి. ఇందుకోసం కెమెరా యాప్‌ని ఓపెన్‌ చేసి పోర్ట్రెయిట్ మోడ్, ల్యాండ్‌స్కేప్, నైట్ మోడ్ లేదా ప్రో మోడ్ వంటి అనేక మోడ్‌లను చూడవచ్చు. మీ ఆప్షన్‌ ప్రకారం సెట్టింగ్స్‌ సర్దుబాటు చేసుకోవచ్చు.

అధిక కాంట్రాస్ట్

మీరు ఫోన్ కెమెరాతో అధిక కాంట్రాస్ట్ చిత్రాన్ని క్లిక్ చేసినప్పుడు HDR మోడ్‌పై మాత్రమే క్లిక్ చేయాలి. ఇది కాకుండా ఫోటోను క్లిక్ చేస్తున్నప్పుడు స్క్రీన్‌పై నొక్కడం ద్వారా ఎక్స్‌పోజర్, ఫోకస్‌ను మాన్యువల్‌గా సర్దుబాటు చేయాలి. అప్పుడు ఫొటో చక్కగా కనిపిస్తుంది.

Tags:    

Similar News