ఫోన్‌లో సినిమా చూస్తుంటే బ్యాటరీ తొందరగా అయిపోతుందా.. ముందు ఈ సెట్టింగ్స్ చేయండి..!
Smartphone Battery Settings: నేటి రోజులలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ అందుబాటులోకి రావడంతో చాలామంది స్మార్ట్‌ఫోన్‌లలోనే సినిమాలు, సిరీస్‌లు చూస్తున్నారు.
ఫోన్‌లో సినిమా చూస్తుంటే బ్యాటరీ తొందరగా అయిపోతుందా.. ముందు ఈ సెట్టింగ్స్ చేయండి..!
Smartphone Battery Settings: నేటి రోజులలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ అందుబాటులోకి రావడంతో చాలామంది స్మార్ట్‌ఫోన్‌లలోనే సినిమాలు, సిరీస్‌లు చూస్తున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ దీనివల్ల స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ తొందరగా అయిపోతుంది. ఫోన్‌ని మళ్లీ మళ్లీ ఛార్జి చేయాల్సి వస్తుంది. అయితే సినిమా చూస్తున్నప్పుడు ఫోన్ బ్యాటరీ అయిపోకూడదంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ఇందుకోసం ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ సెట్టింగ్స్ చేయాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
స్మార్ట్‌ఫోన్‌లో సినిమాలు చూసే ముందు అనవసరమైన యాప్‌లను అన్ ఇన్‌స్టాల్ చేయాలి. లేదంటే బ్యాటరీ తొందరగా అయిపోతుంది. వీటిని తొలగించడం వల్ల బ్యాటరీ ఎక్కువ సమయం వస్తుంది. అలాగే ఫోన్‌ని బ్లూటూత్ ఆడియో పరికరానికి కనెక్ట్ చేయాలి. ఇది స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని ఆదా చేస్తుంది. ఒకేసారి చాలా సినిమాలను చూసే అవకాశం కల్పిస్తుంది. ఇది కాకుండా ఫోన్‌లో సినిమాలు చూస్తున్నప్పుడు వాల్యూమ్‌ను తక్కువగా పెట్టుకోవాలి. అధిక వాల్యూమ్‌లో సినిమాలు ఎప్పుడు చూడకూడదు. దీనివల్ల బ్యాటరీని ఆదా అయి ఎక్కువ సమయం సినిమాలు చూడవచ్చు.
స్మార్ట్‌ఫోన్‌లో సినిమాలు చూసే ముందు బ్రైట్‌నెస్‌ని 80% కంటే తక్కువగా ఉండేవిధంగా చూసుకోవాలి. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ బ్యాటరీపై అదనపు భారం తగ్గుతుంది. ఒకేసారి చాలా సినిమాలను చూడవచ్చు. ఇది కాకుండా ఫోన్‌ని ఎప్పుడు వందశాతం ఛార్జింగ్ పెట్టకూడదు. దీనివల్ల బ్యాటరీ తొందరగా దెబ్బతింటుంది. అలాగే 20 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు సినిమాలు చూడవద్దు. 80 నుంచి 20 శాతం మధ్యలో బ్యాటరీ ఉండే విధంగా చూసుకోవాలి. దీనివల్ల బ్యాటరీ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.