Social Media: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారా.. వీటిపై అవగాహన లేకుంటే రూ.50 లక్షల జరిమానా..!

Social Media: ఈ రోజుల్లో యువత సోషల్‌ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు.

Update: 2023-07-20 08:36 GMT

Social Media: సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారా.. వీటిపై అవగాహన లేకుంటే రూ.50 లక్షల జరిమానా..!

Social Media: ఈ రోజుల్లో యువత సోషల్‌ మీడియాలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. అందుకే ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సంస్థలు మంచి లాభాలతో నడుస్తున్నాయి. మరికొంతమంది వీటినే ఉపాధిగా ఎంచుకుంటున్నారు. లక్షలాది మంది ఫాలోవర్లని కలిగి ఉండి ఇన్‌ఫ్లుయెన్సర్‌లుగా మారుతున్నారు. బాలీవుడ్, స్పోర్ట్స్ సెలబ్రిటీల మాదిరి ఫాలోవర్లని రకరకాలుగా ప్రభావితం చేస్తున్నారు. దీంతో కొన్ని చిన్న చిన్న కంపెనీలు వారి ఉత్పత్తులని వీరితో పబ్లిసిటీ చేయించుకుంటున్నాయి. దీంతో వారికి ఆదాయం సమకూరుతుంది.

ఇక్కడివరకు బాగానే ఉన్నప్పటికీ ఇన్‌ఫ్లుయెన్సర్‌ల వల్ల కొన్నిసార్లు జనాలు కూడా మోసపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. డబ్బుల కోసం ఆశపడి వీరు నకిలీ ఉత్పత్తులు, ఫేక్‌ స్కీంలని ప్రచారం చేస్తున్నారు. దీంతో వినియోగదారులు ఈ ఉచ్చులో పడి మోసపోతున్నారు. వారి విలువైన ధనాన్ని, సమయాన్ని కోల్పోతున్నారు. అందుకే ఇన్‌ఫ్లుయెన్సర్ ఏ విషయం గురించి అయినా ప్రమోట్‌ చేసేటప్పుడు ఒక్కసారి దాని గురించి క్రాస్‌ చెక్‌ చేసుకోవాలి. లేదంటే చాలామందిని మోసం చేసినవారవుతారు.

ఇటీవల ముంబైలో ఒక సంఘటన జరిగింది. ఇందులో ఇన్‌ఫ్లుయెన్సర్లు ఒక మోసపూరిత ఇన్వెస్ట్‌ స్కీంని ప్రమోట్‌ చేశారు. కేవలం 30 నుంచి 35 నిమిషాల్లో మీ డబ్బు రెట్టింపు అవుతుందని పేర్కొన్నారు. రూ.999 స్కీంని చాలా మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ప్రమోట్‌ చేశారు. తర్వాత ఈ స్కీం ఫేక్‌ అని తేలింది. అప్పటికే చాలామంది ఈ స్కీంలో ఇన్వెస్ట్‌ చేసి మోసపోయారు. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌ల కోసం ప్రభుత్వం ఈ ఏడాది కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. వినియోగదారుల రక్షణ చట్టం కింద ఎవరైనా ఇలా చేస్తే 10 లక్షల నుంచి 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. ఇది కాకుండా 1 నుంచి 3 సంవత్సరాల వరకు ప్రమోషన్ లేదా ప్రకటనలపై నిషేధం విధిస్తారు.

Tags:    

Similar News