అందుబాటులోకి ఎయిర్‌లెస్‌ టైర్లు.. గాలి నింపాల్సిన అవసరం ఉండదు పంక్చర్ భయం అస్సలుండదు..!

Airless Tire Technology: దాదాపు అన్ని వాహనాలకు టైర్లు ఉంటాయి. కొన్ని టైర్లలో ట్యూబ్‌లు కూడా ఉంటాయి. మరికొన్ని ట్యూబ్‌లెస్‌ టైర్లుగా ఉంటాయి.

Update: 2023-09-19 14:30 GMT

అందుబాటులోకి ఎయిర్‌లెస్‌ టైర్లు.. గాలి నింపాల్సిన అవసరం ఉండదు పంక్చర్ భయం అస్సలుండదు..!

Airless Tire Technology: దాదాపు అన్ని వాహనాలకు టైర్లు ఉంటాయి. కొన్ని టైర్లలో ట్యూబ్‌లు కూడా ఉంటాయి. మరికొన్ని ట్యూబ్‌లెస్‌ టైర్లుగా ఉంటాయి. అయితే అన్నిటిలో కచ్చితంగా గాలి నింపాలి లేదంటే అవి పనిచేయలేవు. అంతేకాదు ఇవి తరచుగా పంక్చర్‌ కూడా అవుతుంటాయి. దీనివల్ల కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ ఇటువంటి సమస్యలు తలెత్తకుండా Ohio కంపెనీ ఎయిర్‌లెస్ టైర్‌లను తయారుచేసింది. NASA రోవర్ టైర్ టెక్నాలజీని అనుసరించి ఈ టైర్లని రూపొందించారు. అయితే ఎయిర్‌లెస్ టైర్ కాన్సెప్ట్‌ని ప్రదర్శించడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు బ్రిడ్జ్‌స్టోన్, మిచెలిన్ మొదలైన కంపెనీలు కూడా ఇలాంటి కాన్సెప్ట్‌లను ప్రవేశపెట్టాయి.

ఎయిర్‌ లెస్ టైర్లు

SMART ఎయిర్‌లెస్ టైర్లు అమ్మకానికి వచ్చాయి. ప్రస్తుతం ఈ టైర్లను సైకిళ్లకు మాత్రమే అమర్చారు. భవిష్యత్తులో కార్లు, బైక్‌లకు కూడా తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. కాయిల్-స్ప్రింగ్ ఇంటర్నల్‌ నిర్మాణం కారణంగా టైర్ బెండ్‌ కాకుండా ఉంటుంది. వీటిలో గాలి నింపాల్సిన అవసరం ఉండదు. పంక్చర్ అయ్యే ప్రమాదం కూడా ఉండదు. ఈ టైర్ రబ్బరుతో కాదు లోహంతో తయారవుతుంది. ఇది స్లింకీ లాంటి స్ప్రింగ్‌ని కలిగి ఉంటుంది. ఈ స్ప్రింగ్ నికెల్-టైటానియం మెటల్‌తో తయారవుతుంది. ఈ లోహాన్ని నిటినోల్ అని పిలుస్తారు.

ప్రత్యేకత

టైటానియం లాగా దృఢంగానూ, రబ్బరులా ఫ్లెక్సిబుల్ గానూ ఉండడం దీని ప్రత్యేకత. నిటినోల్‌పై ఒత్తిడి పెరిగినప్పుడు దాని ఆకారం మారిపోతుంది తర్వాత పాత స్థితికి వస్తుంది. ఇది మెటల్ టైర్‌కు నెమ్మదిగా కంప్రెస్, రీబౌండ్ చేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఇది సాధారణ రబ్బరు టైర్ లాగానే ఉంటుంది. దీనివల్ల వాహనాలు రన్నింగ్‌ సమయంలో ప్రమాదాలు జరగకుండా కాపాడవచ్చు.

Tags:    

Similar News