సచిన్‌ పోస్టుకు‌.. యువరాజ్‌ అదిరిపోయే కామెంట్

Update: 2019-12-28 16:53 GMT
సచిన్‌ ,యువరాజ్‌

టీమిండియా మాజీ దిగ్గజ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ ఆసక్తిక ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇటీవలీ కాలంలో సచిన్ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తూ వార్తల్లో ఎక్కుతున్నారు. ఈ మధ్య కాలంలో తన అభిమాని సచిన్ కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసి తన ఫ్యాన్‌ను కలవాలని అతను ఎక్కడుంటాడో చెప్పాలని పోస్టు చేసిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా సచిన్ పెట్టిన పోస్టు మరోసారి వైరల్ అయింది. భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ జన్మదినరోజు ఓ ఫోటో పోస్టు చేశారు. అందులో సచిన్ తోపాటు యూవీ, మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ముగ్గురు ఉన్నారు. ఆ ఫోటోను సచిన్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. యువరాజ్ పుట్టిన రోజుకు తన మిత్రులతో కలిసి పాల్గొన్నాందుకు సంతోషంగా ఉందని పోస్టు చేశారు.

సచిన్ పోస్ట్ పై స్పందించిన యువరాజ్ సింగ్ సచిన్ పోస్టు చేసిన ఫోటోలో నా చెయ్యి కనిపించలేదని కామెంట్ పెట్టాడు. యూవీ పెట్టిన ఫన్నీ కామెంట్ ఇప్పడు వైరల్ అయింది. యూవీ పుట్టినరోజు ఈనెల 12న జరుపుకోగా.. ఈ సంవత్సరం సోషల్ మీడియా అత్యధిక మంది నెటిజన్లు శోధించిన క్రికెటర్ గా యూవీ రికార్డుకెక్కాడు.

సచిన్ తన కెరీర్ లో 200 టెస్టులు ఆడి 15,921 పరుగులు చేశాడు. 51 సెంచరీలు 68 అర్ధసెంచరీలు ఉన్నాయి. 463వన్డేలు ఆడిన సచిన్ 18, 426 పరుగు చేశాడు. అందులో 49సెంచరీతోపాటు 96 అర్థసెంచరీలు ఉన్నాయి.



   

Tags:    

Similar News