WTC Final Prize Money: డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ..విన్నర్ కు ఎన్ని కోట్లంటే?

WTC Final Prize Money: విజేతకు గదతో పాటు 16 లక్షల డాలర్లు అంటే రూ.13.22 కోట్లు ప్రైజ్ మనీ సొంతం కానుంది.

Update: 2023-05-26 12:02 GMT

WTC Final Prize Money: డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ..విన్నర్ కు ఎన్ని కోట్లంటే?

WTC Final Prize Money: డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రైజ్ మనీని ఐసీసీ రివీల్ చేసింది. జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లండ్ లోని ఓవల్ లో భారత్, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఛాంపియన్ షిప్ ప్రైజ్ మనీ వివరాలను ఐసీసీ ప్రకటించింది. విజేతకు గదతో పాటు 16 లక్షల డాలర్లు అంటే రూ.13.22 కోట్లు ప్రైజ్ మనీ సొంతం కానుంది. ఇక రన్నరప్ టీమ్ కు విజేతకు లభించిన ప్రైజ్ మనీలో సగం అంటే 8 లక్షల డాలర్లు అంటే సుమారు రూ.6.6 కోట్లు దక్కనున్నాయి.

ఇక మూడో స్థానంలో నిలిచిన సౌతాఫ్రికాకు రూ.3.6 కోట్లు, నాల్గవ స్థానంలో నిలిచిన ఇంగ్లండ్ కు రూ.2.8 కోట్లు, 5వస్థానం దక్కించుకున్న శ్రీలంకకు రూ.1.6 కోట్లు లభించనున్నాయి. ఇక 6 నుంచి 9 స్థానాల వరకు ఉన్న న్యూజిలాండ్, పాకిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్ జట్లకు రూ.82 లక్షల పారితోషికం లభించనుంది.

2021లో జరిగిన ఫైనల్స్ లో ఇండియాను ఓడించి న్యూజిలాండ్ విశ్వవిజేతగా నిలిచిన విషయం మనకు తెలిసిందే. ఆ టీమ్ కు గదతో పాటు 16 లక్షల డాలర్లను ప్రైజ్ మనీగా ఇచ్చారు. రెండో స్థానంలో నిలిచిన భారత్ కు 8 లక్షల డాలర్లు దక్కాయి. ఈసారి కూడా అదే అమౌంట్ ను ఐసీసీ కేటాయించింది. మరోవైపు డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా ఇరు జట్లు ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి. ఐపీఎల్ లో అడుతున్న ఇరు జట్ల ఆటగాళ్లు..టోర్ని ముగిసిన వెంటనే లండన్ బయల్దేరతారు 

Tags:    

Similar News