PAK vs NAM: పీసీబీ సంచలన నిర్ణయం.. బాబర్, ఆఫ్రిదిలపై వేటు!
భారత్ పై పాకిస్థాన్ ఓడిపోవడంతో ఆ టీమ్ లోని ఇద్దరు సీనియర్లపై వేటు పడినట్టు తెలుస్తోంది. బాబర్ , అఫ్రిదీలను నమీబియాతో మ్యాచ్ కు దూరం పెట్టారు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు సంబంధించిన సంచలన వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మాజీ కెప్టెన్లు బాబర్ ఆజామ్, షాహీన్ షా అఫ్రిదిలను నమీబియాతో జరిగే కీలక మ్యాచ్‌లకు జట్టులోంచి తప్పించే ఆలోచనలో జట్టు మేనేజ్‌మెంట్‌ని ప్రకటించారు. సంకేతాలు ఈ ఇద్దరు సీనియర్ పేలవ ప్రదర్శనపై అసంతృప్తితో ఉన్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. భారత్‌పై దారుణ ఓటమి అనంతరం పాక్ మాజీలు కూడా బాబర్, ఆఫ్రిదిలపై మండిపడుతున్న విషయం తెలిసిందే.
భారత్‌పై జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ తర్వాత పాక్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో బాబర్ అజామ్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటవ్వగా.. షాహీన్ అఫ్రిది తన రెండు ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి పూర్తిగా నిరాశపరిచాడు. ఈ ఇద్దరి పేలవ ప్రదర్శనలు విమర్శలకు దారితీశాయి. మ్యాచ్ అనంతరం జట్టు కోచ్ మైక్ హెసెన్ మాట్లాడుతూ.. ఆటగాళ్లు ఒత్తిడిలో ప్రాథమిక విషయాలను మర్చిపోతున్నారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లైనా, కీలక సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మెరుగుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో బాబర్ ఆజామ్, షాహీన్ ఆఫ్రిదిలను విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయిస్తే.. వారి స్థానాల్లో ఫకర్ జామన్, నజీమ్ షాలకు అవకాశం దక్కనుంది. ఈ ఇద్దరితో పాటు షాబాద్ ఖాన్‌పై కూడా వేటు పడే అవకాశాలు లేకపోలేదు. ఫామ్ లేని సీనియర్లను తపించి.. జట్టులోకి యువకులకు అవకాశాలు ఇవ్వాలని మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఇప్పటికే సూచించాడు. ఇక నమీబియాతో మ్యాచ్ పాక్ జట్టుకు కీలకమైనది. గెలిస్తేనే సూపర్-8 దశకు చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే మాత్రం టోర్నీ నుంచి బయటకు వచ్చే ప్రమాదం ఉంది. మొత్తంగా చూస్తే.. పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం ఫామ్, వ్యూహం, ఎంపికలపై ఒత్తిడిలో ఉంది. సీనియర్లను తప్పించి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలా? లేదా అనుభవజ్ఞులపైనే నమ్మకం ఉంచాలా? అనే దానిపై మేనేజ్‌మెంట్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.