WPL 2026 : డబ్ల్యూపీఎల్ ఫ్యాన్స్‌కు షాక్..ఖాళీ స్టేడియాల్లో రెండు కీలక మ్యాచ్‌లు?

WPL 2026 : డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. డీవై పాటిల్ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోతోంది.

Update: 2026-01-13 05:20 GMT

WPL 2026 : డబ్ల్యూపీఎల్ ఫ్యాన్స్‌కు షాక్..ఖాళీ స్టేడియాల్లో రెండు కీలక మ్యాచ్‌లు?

WPL 2026 : డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. డీవై పాటిల్ స్టేడియం ప్రేక్షకులతో కిక్కిరిసిపోతోంది. అయితే, జనవరి 14, 15 తేదీల్లో జరగాల్సిన మ్యాచ్‌లకు ప్రేక్షకుల ఎంట్రీపై బ్యాన్ విధించే అవకాశం ఉంది. ముంబై, నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జనవరి 15, 2026న జరగనున్నాయి. ఈ ఎన్నికల విధుల్లో పోలీసులు బిజీగా ఉండటం వల్ల, స్టేడియం వద్ద పటిష్టమైన భద్రత కల్పించడం సాధ్యం కాదని పోలీసు శాఖ బీసీసీఐకి స్పష్టం చేసింది. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా ప్రేక్షకులను అనుమతించకుండానే క్లోజ్డ్ డోర్ పద్ధతిలో మ్యాచ్‌లు నిర్వహించాలని బోర్డు భావిస్తోంది.

ప్రభావితమయ్యే మ్యాచ్‌లు

జనవరి 14: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ యూపీ వారియర్స్.

జనవరి 15: ముంబై ఇండియన్స్ వర్సెస్ యూపీ వారియర్స్.

బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా దీనిపై స్పందిస్తూ.. "ఎన్నికల కారణంగా 14, 15 తేదీల్లో ప్రేక్షకులపై ఆంక్షలు ఉండవచ్చు. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు కానీ, ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన విడుదల చేస్తాం" అని తెలిపారు. అంతేకాదు, జనవరి 16న ఓట్ల లెక్కింపు ఉండటంతో ఆ రోజు జరిగే ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ మ్యాచ్ పరిస్థితిపై కూడా సందిగ్ధత నెలకొంది. అయితే 16వ తేదీన ప్రేక్షకులను అనుమతించే అవకాశాలు ఉన్నాయని సైకియా హింట్ ఇచ్చారు. ప్రస్తుతం అధికారిక టికెటింగ్ పార్ట్‌నర్ వెబ్‌సైట్‌లో ఈ మూడు రోజులకు సంబంధించిన టికెట్లు అందుబాటులో లేకపోవడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది.

నిజానికి ఈ టోర్నీ షెడ్యూల్ నవంబర్ 29నే విడుదలైంది, కానీ ఎన్నికల తేదీలు డిసెంబర్ 15న ప్రకటించబడ్డాయి. ఈ అనివార్య కారణాల వల్ల బీసీసీఐకి టికెట్ల రూపంలో వచ్చే ఆదాయానికి గండి పడటమే కాకుండా, స్టేడియంలో తమ అభిమాన జట్లను ఉత్సాహపరచాలనుకున్న ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ ఎదురుకానుంది. జనవరి 17న జరిగే డబుల్ హెడర్ మ్యాచ్‌ల నుండి మళ్ళీ ప్రేక్షకులను అనుమతించే అవకాశం ఉంది. ఆ తర్వాత టోర్నీ వడోదరకు షిఫ్ట్ కానుంది.

Tags:    

Similar News