WPL 2025: డబ్ల్యూపీఎల్ ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లిన ముంబై ఇండియన్స్.. 6వికెట్ల తేడాతో యూపీ ఓటమి
WPL 2025: ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌ను ఓడించింది. దీనితో యూపీ వారియర్స్ జట్టు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ నుండి నిష్క్రమించే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో యుపి వారియర్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 150 పరుగులు చేసింది. 151పరుుగల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 9 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచింది. హేలీ మాథ్యూస్ ముంబై జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆమె 68 పరుగులు చేసి బౌలింగ్‌లో 2 వికెట్లు కూడా పడగొట్టింది.
ప్లేఆఫ్స్‌కు దగ్గరగా ముంబై ఇండియన్స్
ముంబై ఇండియన్స్ ఇప్పుడు 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించి, ప్రస్తుతం 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. దీని తరువాత ముంబైకి ఇంకా 2 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ మ్యాచ్‌లలో దేనినైనా గెలిస్తే మాత్రమే ముంబై ఇండియన్స్ కూడా ప్లేఆఫ్స్‌లో స్థానం సంపాదించుకుంటుంది. ఇదే జరిగితే ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ఇది వరుసగా మూడోసారి అవుతుంది.
ముందుగా, అమేలియా కెర్ ముంబై ఇండియన్స్ విజయానికి పునాది వేసింది. తను 4 ఓవర్లలో 38 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. అయితే, హేలీ మాథ్యూస్ బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మ్యాచ్ విజయానికి పెద్ద సహకారాన్ని అందించారు. తను బౌలింగ్‌లో 2 వికెట్లు పడగొట్టింది. బ్యాటింగ్‌లో 68 పరుగులు చేసిన ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇన్నింగ్స్‌లో మాథ్యూస్ 8 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టింది. మాథ్యూస్‌తో పాటు, నాట్ స్కైవర్-బ్రంట్ కూడా ముంబై ఇండియన్స్ తరపున బ్యాటింగ్‌లో మెరిశాడు. మిడిల్ ఓవర్లలో 37 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో అమన్‌జోత్ కౌర్ 12 పరుగులు, యాస్టికా భాటియా 10 పరుగులు చేసి ముంబై విజయాన్ని కన్ఫాం చేశారు.