Boxing day test: సెంచరీతో అదరగొట్టిన రహానే..ఆసీస్ పై భారత్ పైచేయి!

Boxing day test: ఆసీస్ పై భారత్ పైచేయి!

Update: 2020-12-27 07:46 GMT

ఆస్ట్రేలియా తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్ పైచేయి సాధించింది. రహానే అద్భుత సెంచరీతో భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో కంగారూల పై ఆధిక్యం దిశలోకి వెళ్ళింది. కోహ్లీ స్థానంలో కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రహానే టెస్టుల్లో 12 వ సెంచరీ నమోదు చేసుకున్నాడు. రహానేకు జడేజా(40) రూపంలో మంచి సహకారం అందడంతో భారత జట్టు ఆసీస్ పై ఆధిక్యంలోకి దూసుకు వెళ్ళింది. 

బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లో రెండోరోజు ఆట ముగిసే సరికి భారత్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఇప్పటి వరకూ 82 పరుగుల ఆధిక్యం లభించింది. ఆరో వికెట్ కు రహానే, జడేజాలు ఇప్పటి వరకూ అజేయంగా 104 పరుగులు జోడించారు. రహానే 104 పరుగులతోనూ..జడేజా 40 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 

రెండోరోజు వికెట్ నష్టానికి 36పరుగులతో తోలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. తోలి టెస్ట్ ఆడుతున్న శుభ్‌మ‌న్ గిల్ 45 పరుగులకు అవుటయ్యాడు. పుజారా 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. 64 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ రహానే పోరాటం మొదలు పెట్టాడు. విహారీతో కల్సి నాలుగో వికెట్ కు 52 పరుగులు జోడించాడు. విహారీ 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. తరువాత వచ్చిన వికెట్ కీపర్ పంత్ తో కలిసి 57 పరుగులు జోడించిన రహానే, పంత్ (29) అవుటయ్యాకా వచ్చిన జడేజాతో కలిసి ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టిస్తున్నారు. మొదటి టెస్ట్ కు గాయం కారణంగా దూరమైన జడేజా ఆసీస్ బౌలర్లను గట్టిగా ఎదుర్కొన్నాడు. రహానేకు తోడుగా నిలిచి 40 విలువైన పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఆసీస్ పై భారత్ ఆధిక్యం సాధించింది. 

Tags:    

Similar News