కోహ్లీ రికార్డ్ రోహిత్ బ్రేక్ చేస్తాడా?

భారత జట్టు సారధి కోహ్లీ, తాత్కాలిక సారధి రోహిత్ రికార్డులు సృష్టించడంతో మరోసారి పోటీ పడనున్నారు.

Update: 2019-11-02 04:32 GMT

భారత జట్టు సారధి కోహ్లీ, తాత్కాలిక సారధి రోహిత్ రికార్డులు సృష్టించడంతో మరోసారి పోటీ పడనున్నారు. టీ20ల్లో కోహ్లీ వరల్డ్ నెం1 రికార్డును బద్దలు కొట్టేందుకు రోహిత్ కన్నేశాడు. బంగ్లాదేశ్ తో జరగనున్న టీ20 సిరీస్‌లో భారత్ తలపడనుంది. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ గా కోహ్లీ 67 ఇన్నింగ్స్ లు ఆడి 2450 పరుగులు సాధించి మొదటి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ రికార్డుకు దగ్గరలో రోహిత్ ఉన్నాడు. 90 ఇన్నింగ్స్‌ల్లో ఆడిన రోహిత్ 2,443 పరుగులు చేసిన కోహ్లీ రికార్డు అధిగమించేందుకు మరో 8 పరుగుల దూరంలో ఉన్నాడు. రోహిత్ తర్వాతి స్థానంలో మార్టిన్ గప్తిల్ 2285 పరుగులుతోను, పాక్ ప్లేయర్ షోయబ్ మాలిక్ 2,285 పరుగులతోనూ , నూజిలాండ్ ఆటగాడు మెక్‌కలమ్ 2,140 పరుగులతోను టాప్ 5లో కొసాగుతున్నారు.

ఆదివారం నుంచి బంగ్లాతో జరిగే మూడు టీ20ల సిరీస్‌లో భారత జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ ఈ రికార్డును అధిగమించే అవకాశాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా సిరీస్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మకు రికార్డు త్వరగానే అధిగమించే అవకాశం ఉంది. కెప్టెన్ కోహ్లీ కూడా టీ20 సిరీస్ విశ్రాంతి తీసుకున్నాడు. ఈ సిరీస్ లో రోహిత్ మరో 8 పరుగులు చేస్తే అగ్రస్థానంలో దక్కుతుంది.

కాగా.. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో రోహిత్ ఉదర భాగంలో బంతి బలంగా తగిలింది. దీంతో అతడు విలవిలలాడాడు అనంతరం ప్రాక్టీస్ సెషన్ నుంచి మైదానం వీడాడు. రోహిత్ ను పరీక్షించిన వైద్యులు గాయంతో ఇబ్బంది లేదని చెప్పారు. రోహిత్ ఆదివారం జరగబోయే తొలి టీ20 ఆడవచ్చని స్పష్టం చేశారు. దీంతో బీసీసీఐ కూడ రోహిత్ మ్యాచ్ ఆడతాడని, అతడు ఫిట్‌గానే ఉన్నాడని తెలిపింది. నవంబర్ మూడు నుంచి బంగ్లాతో టీ20 సిరీస్ జరగనుంది.

Tags:    

Similar News