Ishan Kishan Girlfriend: ఇంత క్యూట్‌గా ఎవరూ ఉండరేమో.. ఇషాన్‌ కిషన్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ను ఓసారి చూసేయండి!

Ishan Kishan Girlfriend: ఇషాన్ బ్యాటింగ్‌తో మ్యాచుల్ని గెలిపిస్తుంటే.. అదితి తన స్టైల్, అందంతో మనసులు గెలుస్తోంది.

Update: 2025-03-25 02:00 GMT

Ishan Kishan Girlfriend: ఇంత క్యూట్‌గా ఎవరూ ఉండరేమో.. ఇషాన్‌ కిషన్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ను ఓసారి చూసేయండి!

Ishan Kishan Girlfriend: ఈ ఐపీఎల్‌లో ఎవరు టాప్ గేమ్ ఆడుతున్నారో అందరికీ తెలిసిన విషయమే. హైదరాబాద్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై తన శతకంతో పర్ఫెక్ట్ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు ఇషాన్ కిషాన్. అతను ఫీల్డ్‌లో దుమ్మురేపుతుంటే.. సోషల్‌మీడియాలో మాత్రం ఇంకొకరు ప్రజల మనసులను దోచేస్తుంటారు. ఆమె ఎవరో తెలుసా? అదితి హుండియా.

ఇషాన్ కిషన్‌కి రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్‌గా పేరు పొందిన ఈ అందమైన అమ్మాయి ఒక మోడల్. సోషల్ మీడియాలో ఓ సెలబ్రిటీ. అదితి అందాన్ని చెప్పాలంటే మాటలు చాలవు. ఆమె చిరునవ్వే చాలు, అభిమానుల హృదయాలు కొల్లగొట్టడానికి. ఆమె ముఖంలో ముసురుకునే మాధుర్యం, ఆమె కళ్లలో మెరుస్తున్న ఉత్సాహం, తనదైన స్టైల్‌తో ఓ వేదికపైనే కాదు, వేలాది హృదయాలపై కూడా ఏలుతోంది.

జైపూర్‌కు చెందిన అదితి, మిస్ ఇండియా 2017 ఫైనలిస్ట్. ఆ తర్వాత మిస్‌ సుప్రానేషనల్‌ ఇండియా2018 కిరీటం సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసిందే లేదు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వేసే ప్రతి పోస్ట్ ఫ్యాషన్ ప్రపంచాన్ని కొద్దిసేపు ఆపేస్తుంది. బోల్డ్ లుక్స్‌తో పాటు, క్యూట్ మానరిజమ్స్ ఆమెను ఓ స్పెషల్ పర్సన్‌గా నిలబెట్టాయి. ఇషాన్ ఆట చూస్తూ స్టాండ్స్‌లో ఉండే ఆమె రియాక్షన్స్ కూడా ఇప్పుడు ఫ్యాన్స్‌కి హైలైట్ అయిపోయాయి. ఒకవైపు బ్లాస్టింగ్ బ్యాట్స్‌మన్, మరోవైపు హార్ట్ స్టీలింగ్ బ్యూటీ..! ఇది అసలైన పవర్ కపుల్ అనిపిస్తోంది. ఈ ఐపీఎల్‌లో స్కోర్లు ఎంత ఎత్తుకెక్కుతున్నాయో, వారి కెమిస్ట్రీ కూడా అంతే వైరల్ అవుతోంది.

Tags:    

Similar News