విండిస్‌పై భారత్ ఘనవిజయం

విండిస్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ ఉమెన్ జట్టు రెండో వన్డే మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది.

Update: 2019-11-04 08:33 GMT
India Women Team

విండిస్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్ ఉమెన్ జట్టు రెండో వన్డే మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణయిత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్ట్రానికి 191 పరుగులు సాధించింది. టీమిండియా ఓపెర్లు పునీయా 5 పరుగులు చేసి నిరాశపరచగా, జమియా పరుగులేమి చేయకుండా డక్కౌట్ అయింది. దీంతో భారత్ 17 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్ట్రాల్లో పడింది. కాగా, మిథాలీ రాజ్(40), స్టార్ బ్యాట్స్ఉమెన్ పునమ్ రౌత్ ఇద్దరు కలిసి 66 పరుగుల భాగస్వామన్యం నమోదు చేశారు. భారత్ పుంజుకుంటున్న సమయంలో విండీస్ బౌలర్ గ్రిమ్మెడ్ మిథాలి వికెట్ పడగొట్టింది. హర్మన్ ప్రీత్ కౌర్(46) దీంతో వీరి భాగస్వామ్యానికి తెర పడింది. పునమ్ రౌత్ (77) అలీయా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయింది. భారత్ 191 పరులు చేసింది.

అనంతరం192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన విండిస్ మహిళా జట్టు తొమ్మిది వికెట్లు 138 పరుగులు చేసింది. విండిస్ జట్టులో క్యాంబెల్ 39 పరుగులు చేసింది. మిగతా బ్యాట్స్ఉమెన్ ఎవరూ రాణిచలేదు. భారత బౌలర్లలో రాజేశ్వరి, పూనమ్, దీప్తిశర్మ తలో రెండు వికెట్లు పడగొట్టారు. మూడు వడ్డేల సిరీస్ లో 1-1తో సమంగా ఉంది. మూడో వన్డే ఫైనల్ మ్యాచ్ ఏడో తేదీ బుధవారం జరగనుంది. 

Tags:    

Similar News