Dwayne Bravo: అంతర్జాతీయ క్రికెట్ కి బ్రావో వీడ్కోలు

*టీ20 ప్రపంచకప్ 2021లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఘోర ఓటమి తరువాత బ్రావో తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడు.

Update: 2021-11-05 07:59 GMT

Dwayne Bravo: అంతర్జాతీయ క్రికెట్ కి బ్రావో వీడ్కోలు

Dwayne Bravo: వెస్టిండిస్ విధ్వంసకర ఆటగాడు బ్రావో టీ20 ప్రపంచకప్ 2021లో గ్రూప్ 1లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఘోర ఓటమి తరువాత తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. టీ20 ప్రపంచకప్ 2021లో భాగంగా నవంబరు 6న ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్ తో విండీస్‌ తరఫున బ్రావోకు అదే చివరి మ్యాచ్ కానుంది.

ఐసిసి పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో బ్రేవో మాట్లాడుతూ 'రిటైర్మెంట్ కి సమయం వచ్చిందని అనిపిస్తోంది. వెస్టిండీస్‌కు 18 ఏళ్ల పాటు ప్రాతినిథ్యం వహించాను. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశానన్నాడు. నా కెరీర్ లో ఎన్నో విజయాలు సాధించానని, మూడు సార్లు ప్రపంచకప్ గెలిచిన జట్టులో ఉండటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు.

ఇక ఈ ప్రపంచకప్ 2021లో తమ జట్టు ప్రదర్శన పట్ల బాధపడాల్సిన అవసరం లేదని ఇది టఫ్ కాంపిటిషన్ అని బ్రేవో తెలిపాడు. 2004లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టిన బ్రావో వెస్టిండీస్‌ తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి 293 మ్యాచ్‌లు ఆడాడు.

ఇప్పటివరకు 90 టీ20 మ్యాచ్‌లు ఆడిన బ్రేవో 1000 పరుగులతో పాటు 78 వికెట్లను పడగొట్టాడు. ఇక తాజా టీ20 ప్రపంచకప్ 2021లో నవంబరు 6న ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్ వెస్టిండిస్ కి నామామాత్రపు మ్యాచ్ అయిన ఆస్ట్రేలియాకి మాత్రం సెమీస్ చేరడానికి కీలక మ్యాచ్ కానుంది.

Tags:    

Similar News