ఆ 30 నిమిషాలు మినహా అంతా బాగుంది

భారత్ వెస్టిండిస్ మధ్య జరిగిన మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల్లో విండీస్ రెండు ఫార్మాట్లో ఓడిపోయింది.

Update: 2019-12-23 10:37 GMT
Virat kohli

భారత్ వెస్టిండిస్ మధ్య జరిగిన మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల్లో విండీస్ రెండు ఫార్మాట్లో ఓడిపోయింది. ఆదివారం కటక్ వేదికగా జరిగిన మూడో వన్డ్లేలో విండీస్ నిర్ధేశించిన 316 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-1తో భారత్ కైవసం చేసుకుంది. భారత్ లో పర్యటనలో ఉన్న విండీస్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లల్లో ఓడినప్పటికీ టీమిండియా అభిమానులను కూడా తమ ఆటతీరుతో ఆకట్టుకుంది.

అయితే మ్యాచ్ అనంతరం మీడియాతో వెస్టిండీస్ కెప్టెన్‌ పొలార్డ్‌ మాట్లాడుతూ.. భారత పర్యటనలో మేము భాగానే రాణించాం, మా జట్టులో ఉన్న ఆటగాళ్లు తమ సత్తానునిరుపించుకున్నారు. ఈ పర్యటనలో మేము నిరాశ చెందడం లేదు. ఈ సిరీస్ లో మేము బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించాం, వరల్డ్ నెం 1 జట్టుతో ఆడతే ఎలా ఉంటుందో భారత్ నిరుపించింది. నెంబర్ 1 జట్టు ఏలా ఆడాలో టీమిండియా ఆలానే ఆడింది.

ఈ సిరీస్ లో విండీస్ జట్టులో ఉన్నకుర్రాళ్లా టాలెంట్‌ను బయటడింది. హెట్‌మెయిర్‌, పూరన్‌, హోప్‌, కాట్రెల్‌లు భాగా రాణించారు. వారి ఆటతీరు అద్భుతంగా ఉంది. ఇదే ఆట తీరు ముందు సిరీస్ ల్లో కొనసాగిస్తామని కోరుకుంటున్నా అని పోలార్డ్ తెలిపారు.

విరాట్‌ కోహ్లి స్పందించారు. ఈ సంవతస్సరం ఘనంగా ముగిసింది. వచ్చే ఏడాది ప్రపంచ కప్ పై దృష్టి సారించాం. భారత బౌలింగ్ దళం భీకర ఫామ్ లో ఉన్నారు. స్పిన్నర్లు, ఫేస్ బౌలర్లు రాణించడం శుభపరిణామం, చివరి మ్యాచ్ లో జడేజా కీలక సమయంలో ఆటతీరు ఆకట్టుకుంది. అంటూ కోహ్లీ వ్యాఖ్యానించారు. ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ పై జరిగిన 30 నిమిషాలు మ్యాచ్ మినహా అంతా బాగా గడిచిందన్నారు.  

Tags:    

Similar News