India vs Bangladesh : కెప్టెన్సీ చేయాలనే ఆలోచన లేదు

ఊహించని రితీలో తనను కెప్టెన్సీ ఇచ్చారని, కెప్టెన్ పదవీ తను ఏప్పుడు కోరుకోలేదని పేర్కొన్నారు.

Update: 2019-11-07 11:53 GMT
Mominul Haque

బుకీలు సంప్రదించినట్లుగా సమాచారం ఇవ్వలేదని బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబుల్ పై ఐసీసీ రెండేళ్ల పాటు నిషేదం విధించిన సంగతి తెసిందే. అయితే మూడు టీ20లు, రెండు టెస్టు సిరీస్ ల కోసం భారత్ లో బంగ్లాదేశ్ జట్టు పర్యటించింది. షకిబుల్ స్థానంలో టీ20లకు కెప్టెన్ గా మహ్మదుల్లాను, టెస్టు సిరీస్‌కు సారధిగా మోమినల్ హక్ ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నియమించింది. ఈ నేపథ్యంలో బంగ్లా ఆటగాడు టెస్టు జట్టు కెప్టెన్ మోమినల్ హక్ ఆసక్తికర వ్యాఖ‌్యలు చేశారు.

ఊహించని రితీలో తనను కెప్టెన్సీ ఇచ్చారని, కెప్టెన్ పదవీ తను ఏప్పుడు కోరుకోలేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. బంగ్లా కెప్టెన్ గా చేయడం అది టీమిండియాతో డే/నైట్ టెస్టుకి కెప్టెన్ గా చేయడం గొప్ప అవకాశం.. కానీ, కెప్టెన్సీ కి నేను సిద్ధంగా లేను అయినప్పటికీ కెప్టెన్సీ బాధ్యత నాకు ఇచ్చారు. నేను ఎప్పుడు బంగ్లా జట్టుకు కెప్టెన్ అవుతానని అనుకోలేదన్నారు. బలవంతంగానే నాకు నూతన బాధ్యత ఇచ్చారని తెలిపారు. టెస్టు మాచ్చుల్లో జట్టును సమర్ధవంతంగా నడిపిస్తానని బోర్డు తనపై పెట్టిన నమ్మకాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తాన్నారు. స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నాలు చేస్తాను అని హక్ చెప్పాడు. 


ఢిల్లీలో అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది.ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ టీమిండియాపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్ లో బంగ్లాదేశ్ 1-0తో ముందజలో ఉంది. బంగ్లాదేశ్ జట్టు గురువారం మరో సమరానికి సిద్దమైంది. ఈ మ్యాచ్ రాజ్‌కోట్‌ వేధికగా జరగనుంది. 



Tags:    

Similar News