Virender Sehwag: వీరేంద్ర సహ్వాగ్, ఆయన భార్య ఆర్తి అహలవత్ మధ్య కారులో జరిగిన గొడవ? విడాకులకు కారణం అదేనా ?

Virender Sehwag: భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సహ్వాగ్ ఇటీవల తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు.

Update: 2025-02-11 04:34 GMT

Virender Sehwag: వీరేంద్ర సహ్వాగ్, ఆయన భార్య ఆర్తి అహలవత్ మధ్య కారులో జరిగిన గొడవ? విడాకులకు కారణం అదేనా ?

Virender Sehwag

భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సహ్వాగ్ ఇటీవల తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలిచారు. పలు నివేదికలు వీరేంద్ర సహ్వాగ్, ఆయన భార్య ఆర్తి అహలవత్ మధ్య ప్రస్తుతం సత్సంబంధాలు లేవని, వారు కొన్ని రోజులుగా వేర్వేరుగా నివసిస్తున్నారని, త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని సూచిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఈ జంట వారి విడాకుల గురించి ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు.

ఇటీవల వీరేంద్ర సహ్వాగ్, ఆర్తి మధ్య కారులో జరిగిన గొడవను చూపిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో వీరేంద్ర సహ్వాగ్, ఆర్తి కారులో కలిసి ఉండగా వారు ఒకరితో ఒకరు గొడవపడుతూ కనిపించారు. ఈ వీడియో ఆధారంగా వీరిద్దరి మధ్య బంధంలో గొడవలు ఉన్నాయని అనేక రకాల వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ వీడియో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా రూపొందించారని తెలుస్తోంది. దాన్ని సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియో అసలు నిజం కాదు.

మొత్తం మీద వీరేంద్ర సహ్వాగ్, ఆర్తి కొన్ని రోజుల కిందట సోషల్ మీడియా లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, వాళ్ళు ఇప్పటి వరకు ఒంటరిగా కనిపించిన దాఖలాల్లేవు. వీరేంద్ర సెహ్వాగ్, ఆర్తి మధ్య సంబంధం తెగిపోయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో వీరేంద్ర సహ్వాగ్, ఆర్తి "గ్రే డివోర్స్" తీసుకుంటారన్న వార్తలు కూడా చర్చలో ఉన్నాయి. 40-50 సంవత్సరాలు లేదా అంతకు పైగా ఉన్న దంపతులు విడిపోతే, దానిని "గ్రే డివోర్స్" అంటారు. ఈ సమయంలో కోర్టు ఆర్ధిక వివాదాలు, పెట్టుబడులు, ఇతర రిటైర్మెంట్ హక్కులను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. సెహ్వాగ్ ఆర్తి 2004 ఏప్రిల్ 22న పెళ్లి చేసుకున్నారు. వారు ఇద్దరూ రెండు పిల్లలకు మాతా పితృలుగా ఉన్నారు. ఆర్యవీర్ సెహ్వాగ్, వెదాంత్ సహ్వాగ్. 2002లో సెహ్వాగ్ ఆర్తిని పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేయగా, ఆర్తి ఆ ప్రతిపాదనను ఒప్పుకుందుంది. అయితే, వారి కుటుంబాలు వీరిద్దరి గురించి ఒప్పుకోకపోవడంతో పెళ్లికి కొంతకాలం వేచి ఉండాల్సి వచ్చింది.

 

Tags:    

Similar News