India vs New Zealand: కోహ్లీని ఊరిస్తోన్న రెండు రికార్డులు

శ్రీలంక ఆస్ట్రేలియా జట్లపై వరుస సిరీస్ గెలుస్తూ కొత్త సంవత్సరాన్ని టీమిండియా ఘనంగా ఆరంభించింది.

Update: 2020-01-23 11:00 GMT

శ్రీలంక ఆస్ట్రేలియా జట్లపై వరుస సిరీస్ గెలుస్తూ కొత్త సంవత్సరాన్ని టీమిండియా ఘనంగా ఆరంభించింది. ఇక జోరుమీదన్న భారత్ మరో దైపాక్షిక సిరీస్‌కు సిద్ధమైంది. న్యూజిలాండ్‌లో పర్యటించిన భారత జట్టు సూదీర్ఘ సిరీస్‌కు సన్నద్దమైంది. న్యూజిలాండ్‌తో టీమిండియా ఐదు టీ20మ్యాచ్‌లు ఆడనుంది, అందులో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ఈ శుక్రవారం నుంచి ఆక్లాండ్ వేదికగా ఆరంభంకానుంది. కాగా.. ఈ సిరీస్‌లో రికార్డుల రారాజు టీమిండియా సారథి విరాట్ కోహ్లీని మరో రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. టీ20ల్లో ఏనిమిది సిక్సర్లు కొడితే విరాట్ కోహ్లీ 50 సిక్సర్లు బాదిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులకు ఎక్కనున్నాడు.

అయితే ఇప్పటివరకు టీ20ల్లో విరాట్ కోహ్లీ 74 సిక్సులు సాధించాడు. కెప్టెన్ గా 42 సిక్సులు కొట్టాడు. న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల మ్యాచులు జరగనుండడంతో ఈ ఫీట్ ను అలవోకగా సాధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గత వరుస సిరీస్ల ల్లో భీకర ఫామ్ లో ఉన్న కోహ్లీ న్యూజిలాండ్ పై అదే ఫామ్ కొనసాగించే అవకాశం ఉంది. దీంతో రికార్డు బద్దలు నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంగ్లండ్‌ క్రికెటర్‌ ఆ జట్టు కెప్టెన్ ఇయాన్‌ మోర్గాన్‌(62) అత్యధిక సిక్సర్ల కొట్టిన కెప్టెన్ల జాబితాలో ఉన్నాడు.

టీ20ల్లో టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని 1,112 పరుగులు కెప్టెన్‌గా చేశాడు. కోహ్లీ ఆ రికార్డు అధిగమించాడానికి 80 పరుగుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ 1,032 పరుగులతో ఉన్నాడు. ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ ధోని రికార్డు కూడా బద్దులు కొట్టే అవకాశం ఉంది. కెప్టెన్ గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో 1,273 పరుగులతో దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరో 241 పరుగులు చేస్తే డుప్లెసిస్ రికార్డు బ్రేక్ చేయవచ్చు. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌1,083తో మూడోస్థానంలో ఉన్నాడు.

జనవరి 24న అక్లాండ్ వేదికగా తొలి టీ20 జరగనుంది. ఆ తర్వాత జనవరి 26న అక్లాండ్ వేదికగా రెండో టీ20, జనవరి 29న హామిల్టన్ వేదికగా మూడో టీ20, జనవరి 31న వెల్లింగ్టన్ వేదికగా నాలుగో టీ20, ఫిబ్రవరి 2న బే ఓవల్ వేదికగా ఐదో టీ20 జరుగుతుంది. 

Tags:    

Similar News