Virat Kohli: లార్డ్స్ లో 89 ఏళ్ళ రికార్డు బద్దలుకొట్టిన విరాట్ కోహ్లి

Update: 2021-08-18 07:25 GMT

విరాట్ కోహ్లీ (ట్విట్టర్ ఫోటో)

India Vs England 2021 Test - Virat Kohli: భారత్ ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ తో కెప్టెన్ విరాట్ కోహ్లి ఒక అరుదైన రికార్డు నెలకొల్పాడు. 1932 లో లార్డ్స్ మైదానంలో సికే నాయుడు నాయకత్వంలో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడిన భారత్.. 2021 ఆగష్టు16 వరకు జరిగిన లార్డ్స్ లో జరిగిన 19 టెస్ట్ మ్యాచ్ లలో కేవలం 3 మ్యాచ్ లలో గెలుపొందింది. 1986లో కపిల్ దేవ్ సారధ్యంలో మొదటి టెస్ట్ గెలిచిన భారత్, 2014లో ధోని కెప్టేన్సీ లో రెండో టెస్ట్, తాజాగా 2021 లో విరాట్ కోహ్లి సారధ్యంలో మూడో టెస్ట్ ని గెలిచింది. ఏడేళ్ళ తరువాత మ్యాచ్ ని గెలవడమే కాకుండా ఇప్పటివరకు లార్డ్స్ మైదానంలో 89 ఏళ్ళలో మొదటిసారిగా ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసిన ఏకైక భారత ఆటగాడిగా కోహ్లి చరిత్ర సృష్టించాడు.

మరోపక్క కోహ్లి సారధ్యంలో ఇప్పటివరకు 63 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన భారత జట్టు 37 విజయాలు సాధించడంతో టెస్ట్ లలో అధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా నాలుగో స్థానంలో విరాట్ నిలిచాడు. మొదటి స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 53 విజయాలతో మొదటి స్థానంలో నిలువగా, ఆస్ట్రేలియాకి చెందిన రికి పాంటింగ్ 48 రెండవ స్థానం, ఇంగ్లాండ్ ఆటగాడు స్టీవ్ వాగ్ 41 మూడో స్థానంలో ఉన్నారు. రెండో టెస్ట్ మ్యాచ్ లో హోరాహోరిగా మాటల యుద్ధంతో పాటు చివరి వరకు నువ్వా నేనా అన్నట్టు జరిగిన మ్యాచ్ లో ఎవరు ఊహించని విధంగా భారత్ గెలవడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఇక భారత్ - ఇంగ్లాండ్ మూడో టెస్ట్ మ్యాచ్ ఆగష్టు 25 నుండి 29 వరకు హెడ్డింగ్లి లో జరగనుంది. 

Tags:    

Similar News