అందులో పాక్ క్రికెటర్ కన్నా వెనుకంజలో కోహ్లీ!

Update: 2019-12-27 10:48 GMT
Babar Azam, Virat Kohli

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఒక్క ఫార్మాట్లో వెనుకంజలో ఉన్నాడు. వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఐసీసీ ప్రకటించిన వన్డే ర్యాంక్‌లో కోహ్లీ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అంతేకాకుండా టెస్టు ర్యాంకింగ్స్‌లో కూడా మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

విజ్డన్ ప్రకటించిన దశాబ్దపు అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో విరాట్ కోహ్లీకి చోటు కల్పించింది. కోహ్లీతో పాటు మరో భారత క్రికెటర్‌ రవిచంద్రన్ అశ్విన్ కు అత్యుత్తమ క్రికెటర్ల జాబితాలో చోటు కల్పించింది. విజ్డన్ ప్రకటించిన వన్డే జట్టుకు కోహ్లీనే కెప్టెన్‌గా ఎంపిక చేయడం విశేషం. కోహ్లీ వన్డే ఫ్మారట్లో కలిపి 5వేల ఏడు వందల పై చిలుకు పరుగులు చేశాడు. 2014లో నుంచి ఇప్పటి 2019 నవంబర్‌లో బంగ్లా పర్యటన వరకూ విరాట్ కోహ్లీ 63 సగటుతో 21 సెంచరీలు, 13 ఆర్థ శతకాలు సాధించి రికార్డు నెలకొల్పాడు.

అంతే‌కాదు క్రికెట్ ఆస్టేలియా ప్రకటించిన డ్రీమ్ టీంలోనూ కోహ్లీకి మొదటి స్థానం ఇచ్చి గౌరవించింది. క్రికెట్ ఆస్టేలియా తమ టెస్ట్ జట్టుకు కూడా భారత సారధి విరాట్ కోహ్లీని కెప్టెన్ గా పేర్కొంది. అంతా బాగానే ఉంది. ఆ ఒక్క ఫార్మాట్‌లో కోహ్లీకి నిరాశ మాత్రం తప్పడం లేదు. పొట్టి ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ టీ20ల్లో పదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కోహ్లీ ఒక స్థానం ముందు టీమిండియా వైస్ కెప్టెన్ హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఉన్నాడు. టీ20ల్లో పాకిస్థాన్ బ్యాట్ బాబార్ ఆజామ్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఫించ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు . 2019లో ఇన్ని ఘనతలు సొంతం చేసుకున్న కోహ్లీ ఆ ఫార్మాట్లో నిరాశతప్పలేదు.

ఐసీసీ అధికారింగా ఉన్న వెట్‌సైట్‌లో ర్యాంకింగ్స్ పరిశీలిస్తే.. పొట్టి ఫార్మాట్‌లో కోహ్లీ(685) పాయింట్లతో పదో స్థానంలో కొనసాగుతుంటే.. టీమిండియా ఓపెనర్ రోహిత్(686) పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఫస్ట్ ప్లేస్‌లో బాబార్ అజామ్ (879)రేటింగ్ పాయింట్లతో ఫస్ట్ ర్యాంక్ తో ఉన్నాడు. రెండో స్థానంలో ఫించ్(810), మూడో స్థానంలో డేవిడ్ మాలన్(782), నాలుగో స్థానంలో కోలిన్ మున్రో(780), ఇక ఐదో స్థానంలో ఆస్ట్రేలియా ప్లేయర్ మ్యాక్స్ వెల్(766) , ఆరో స్థానంలో టీమిండియా ఆటగాడు లోకేష్ రాహుల్(734) కొనసాగుతున్నాడు. టాప్ పది స్థానాల్లో టీమిండియా ప్లేయర్లు ముగ్గురు ఉన్నారు. అయితే ఐసీసీ డిసెంబర్ 11వ  తేదీ వరకు ఉన్న ర్యాంకులు మాత్రమే పరిగణంలొకి తీసుకున్నాం. అధికారికంగా తాజా ర్యాంక్ లు వెలువడలేదు.  

ఇప్పటి వరకూ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో 75 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2,633 పరుగులు సాధించాడు. వ్యక్తిగత అత్యధిక స్కోరు 94* వెస్టిండీస్ సిరీస్ లో రెండో మ్యాచ్‌లో నమోదు చేశాడు. 24 అర్థ సెంచరీలు నమోదు చేశాడు. అయితే ఈ సంవత్సరం అన్ని ఫార్మాట్లో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న కోహ్లీ టీ20 ఫార్మాట్లు పది స్థానంలో ఉండటం అభిమానులను నిరాశపరుస్తుంది. జనవరి5నుంచి శ్రీలంకపై మూడు టీ20ల సిరీస్ జరగనుంది. వచ్చే ఏడాది(2020)లో జరిగే టీ20 వరల్డ్ కప్ లోగా కోహ్లీ తన ర్యాంక్ మెరుగు పరుచుకుంటాడో లేదో చూద్దాం. 




 



Tags:    

Similar News