Virat Kohli : అప్పుడు 8 ఎకరాలు..ఇప్పుడు 5 ఎకరాలు..కోట్లు పెట్టి కోహ్లీ అలీబాగ్‌లో ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసా?
Virat Kohli : టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు తమ ఆస్తుల సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరిస్తున్నారు.
Virat Kohli : అప్పుడు 8 ఎకరాలు..ఇప్పుడు 5 ఎకరాలు..కోట్లు పెట్టి కోహ్లీ అలీబాగ్‌లో ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసా?
Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు తమ ఆస్తుల సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా, అలీబాగ్ సమీపంలో భారీ భూమిని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. పర్యాటక ప్రాంతంగా పేరొందిన అలీబాగ్‌లో ఇప్పటికే వీరికి ఒక విలాసవంతమైన విల్లా ఉండగా, ఇప్పుడు దానికి ఆనుకునే మరో భారీ స్థలాన్ని సొంతం చేసుకున్నారు.
విరాట్ కోహ్లీ దంపతులు జనవరి 13, 2026న అలీబాగ్‌లోని జిరాద్ గ్రామంలో సుమారు 5.19 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ స్థలం కోసం వారు ఏకంగా రూ.37.86 కోట్లు వెచ్చించారు. కేవలం స్థలం ధర మాత్రమే కాకుండా, దీని రిజిస్ట్రేషన్ కోసం రూ.2.27 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30 వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు అధికారిక పత్రాల ద్వారా వెల్లడైంది. గత నాలుగేళ్లలో అలీబాగ్‌లో వీరు కొనుగోలు చేసిన రెండో ఆస్తి ఇది.
కోహ్లీ, అనుష్క కేవలం క్రికెట్, సినిమాల ద్వారానే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో కూడా తెలివైన పెట్టుబడులు పెడుతున్నారు.
ముంబై : వర్లీలోని ఓంకార్ 1973లో సుమారు 7,171 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఖరీదైన అపార్ట్‌మెంట్ ఉంది (విలువ సుమారు రూ.34 కోట్లు).
గురుగ్రామ్ : ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో రూ.80 కోట్ల విలువైన రాజభవనం లాంటి బంగ్లా వీరికి ఉంది.
అలీబాగ్: 2022లో వీరు సుమారు 8 ఎకరాల భూమిని కొనుగోలు చేసి అక్కడ ఒక విలాసవంతమైన విల్లాను నిర్మించుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో 5 ఎకరాలు దీనికి తోడయ్యాయి. దీంతో అలీబాగ్‌లో వీరికి మొత్తం 13 ఎకరాలకు పైగా ఆస్తి ఉంది.
ఆస్తులే కాకుండా, విరాట్ కోహ్లీ One8, WROGN వంటి సొంత బ్రాండ్లను నడుపుతున్నారు. అలాగే రేజ్ కాఫీ, బ్లూ ట్రైబ్ ఫోడ్స్ వంటి పలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు. ఇక అనుష్క శర్మ Nush అనే క్లోతింగ్ బ్రాండ్‌కు యజమాని, క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ ద్వారా పలు విజయవంతమైన వెబ్ సిరీస్‌లను నిర్మించారు. ఈ జంట మొత్తం ఆస్తి విలువ ప్రస్తుతం రూ.1,300 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.