Vaibhav Suryavanshi : సౌతాఫ్రికా వేదికగా వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం..వరల్డ్ కప్ ముందు భారీ స్కెచ్!

భారత క్రికెట్ ఆకాశంలో మరో కొత్త ధ్రువతార ఉదయించింది. ఆ కుర్రాడి పేరు వైభవ్ సూర్యవంశీ. కేవలం 14 ఏళ్ల ప్రాయంలోనే ఐపీఎల్ వేలంలో కోట్ల రూపాయలు పలికి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ బిహార్ సంచలనం.

Update: 2026-01-02 04:26 GMT

Vaibhav Suryavanshi : సౌతాఫ్రికా వేదికగా వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం..వరల్డ్ కప్ ముందు భారీ స్కెచ్!

Vaibhav Suryavanshi : భారత క్రికెట్ ఆకాశంలో మరో కొత్త ధ్రువతార ఉదయించింది. ఆ కుర్రాడి పేరు వైభవ్ సూర్యవంశీ. కేవలం 14 ఏళ్ల ప్రాయంలోనే ఐపీఎల్ వేలంలో కోట్ల రూపాయలు పలికి అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ బిహార్ సంచలనం, ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశాడు. 2026 కొత్త ఏడాదిలో వైభవ్ నేరుగా టీమిండియా నీలి రంగు జర్సీని ధరించి మైదానంలోకి దిగబోతున్నాడు. అది కూడా ఒక సాదాసీదా ప్లేయర్‌గా కాదు.. ఏకంగా భారత అండర్-19 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి దక్షిణాఫ్రికా గడ్డపై గర్జించబోతున్నాడు.

భారత అండర్-19 జట్టు ప్రస్తుతం సౌతాఫ్రికా పర్యటనలో ఉంది. నిజానికి ఈ జట్టుకు ఆయుష్ మ్హాత్రే కెప్టెన్‌గా వ్యవహరించాల్సి ఉంది. కానీ దురదృష్టవశాత్తూ ఆయుష్ గాయపడటంతో పర్యటనకు దూరమయ్యాడు. దీంతో సెలక్టర్లు మరో ఆలోచన లేకుండా టీమ్ పగ్గాలను వైభవ్ సూర్యవంశీకి అప్పగించారు. తన దూకుడు బ్యాటింగ్‌తో ఇప్పటికే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించిన వైభవ్‌కు, నాయకుడిగా ఇది అగ్నిపరీక్ష అని చెప్పాలి. సౌతాఫ్రికా గడ్డపై అడుగుపెట్టడం వైభవ్‌కు ఇదే తొలిసారి, అలాగే టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించడం కూడా ఇదే మొదటిసారి.

జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనున్న అండర్-19 వరల్డ్ కప్ 2026కు ముందు ఈ సౌతాఫ్రికా పర్యటన టీమిండియాకు చాలా కీలకం. విదేశీ పిచ్‌లపై మన కుర్రాళ్లకు ఉన్న పట్టును పరీక్షించుకోవడానికి ఇదో అద్భుతమైన అవకాశం. ఈ పర్యటనలో భాగంగా భారత్, సౌతాఫ్రికా జట్లు మూడు వన్డేల సిరీస్ ఆడనున్నాయి. వరల్డ్ కప్‌లో భారత్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో, కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ ఫామ్ జట్టుకు చాలా అవసరం.

కేవలం 13 ఏళ్ల వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ (రంజీ ట్రోఫీ) ఆడి సచిన్ టెండూల్కర్ రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుపై సెంచరీ బాది తన బ్యాట్ పవర్‌ను ప్రపంచానికి చూపించాడు. ఇటీవలే జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. చిన్న వయసులోనే ఇంతటి పరిణతితో బ్యాటింగ్ చేసే ప్లేయర్ దొరకడం టీమిండియా అదృష్టమని మాజీ క్రికెటర్లు కొనియాడుతున్నారు.

సిరీస్ షెడ్యూల్, వేదికలు

జనవరి 3: మొదటి వన్డే - విలోమూర్ పార్క్.

జనవరి 5: రెండో వన్డే - విలోమూర్ పార్క్.

జనవరి 7: మూడో వన్డే - విలోమూర్ పార్క్.

భారత అండర్-19 జట్టు ఇదే: వైభవ్ సూర్యవంశీ (కెప్టెన్), ఆరోన్ జార్జ్ (వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్, ఆర్ఎస్ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలన్ ఎ పటేల్, మహమ్మద్ ఈనాన్, హెనిల్ పటేల్, దేవంద్రన్ దీపేష్, కిషన్ కుమార్ సింగ్, ఉధవ్ మోహన్, యువరాజ్ గోహిల్, రాహుల్ కుమార్.

Tags:    

Similar News