సిక్సర్లతో చేలరేగిన ఉమేశ్ ... చిందులేసిన విరాట్ కోహ్లీ
మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ చేలరేగిపోయాడు. మరో వైపు ఉమేశ్ సిక్సర్లు కొడుతూంటే కోహ్లీ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేశాడు.
రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ బ్యాటింగ్‌లో రెచ్చిపోయాడు. టెయిలెండర్ బ్యాట్స్‌మన్ గా బరిలోకి దిగిన ఉమేశ్ బ్యాట్ తో సఫారీ బౌలర్లపై చేలరేగిపోయాడు. కేవలం పది బంతులు ఎదుర్కొన్న ఉమేశ్ 31 పరుగులు చేశాడు. అందులో 5 సిక్సర్లు ఉన్నాయి.
ఉమేశ్ బాదిన ఐదు సిక్సర్లు సఫారీ బౌలర్ లిండే బౌలింగ్‌లో సాధించినవే ఉన్నాయి. ఉమేశ్ బ్యాటింగ్ చూసి కెప్టెన్ విరాట్ కోహ్లి ఎంజాయ్ చేశాడు. స్టీఫెన్ ఫ్లెమింగ్ 10బంతుల్లో 30 పరుగులు సాధిస్తే, 9 బంతుల్లోనే 31 పరుగులు చేసి రికార్డును ఉమేశ్ బ్రేక్ చేశాడు. ఉమేశ్ బ్యాటింగ్ చూసిన క్రికెట్ అభిమానులు అర్థశతకం పూర్తి చేసి రికార్డు సృష్టిస్తాడని అనుకున్నారు. కానీ లిండే బౌలింగ్‌లోనే భారీ షాట్‌కు ప్రయత్నించి భారీ షాట్ కు ప్రయత్నించి కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.దీంతో 497 పరుగుల వద్ద కోహ్లీ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ ప్రకటించాడు.
అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా తొమ్మిది పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఎల్గర్ మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. మరో ఓపెనర్ డికాక్‌ను అతని వ్యక్తి గత స్కోరు నాలుగు పరుగుల వద్ద ఉండగానే ఉమేష్ పెవిలియన్‌కు దారి పట్టించాడు.