IPL 2021: టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడుతోంది.

Update: 2021-04-11 13:41 GMT

టాస్ వేస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ (పొటో ట్విట్టర్)

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు జరిగే మూడో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తలపడుతోంది. చెన్నై చెపాక్ స్టేడియంలో ఆరంభమైన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ పిచ్ లో స్పిన్నర్లు కొద్దిగా ఇబ్బంది పడనున్నట్లు తెలుస్తోంది. ఇది డ్రై పిచ్ గా ఉందని విశ్లేషకులు వెల్లడించారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శుబ్మాన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రానా, ఎయోన్ మోర్గాన్ (కెప్టెన్), దినేష్ కార్తీక్ (కీపర్), ఆండ్రీ రస్సెల్, షకీబ్ అల్ హసన్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ ఎలెవన్): డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, వృద్దిమాన్ సాహా (కీపర్), మనీష్ పాండే, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, సందీప్ శర్మ


Tags:    

Similar News