IND vs AUS Final Match: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ ఫైట్..
IND vs AUS Final Match: ఆస్ట్రేలియా ( కీ ప్లేయర్స్)- వార్నర్, స్మిత్, మాక్స్‌వెల్, జంపా
IND vs AUS Final Match: భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ ఫైట్..
IND vs AUS Final Match: వరల్డ్ కప్ లో అంతిమ పోరుకు సర్వం సిద్ధమైంది.. నరేంద్రమోడీ స్టేడియం వేదికగా..భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య హై ఓల్టేజ్ ఫైట్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది.. ఫైనల్ ఫైట్ లో.. టీమిండియా హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.. భారత్ టాపార్డర్ సూపర్ ఫామ్‌లో ఉంది.. రోహిత్- గిల్ జోడీ దాదాపు అన్ని మ్యాచుల్లోనూ శుభారంభాలు అందిస్తోన్న నేపథ్యంలో.. ఈ గేమ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని టీమ్ మేనేజ్ మెంట్ ఆశీస్తోంది.. ఇక కింగ్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ నిలకడగా రాణిస్తున్నారు.. సిచ్యువేషన్స్ కు అనుగుణంగా ఆడటంతో పాటు విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పుతున్నారు.. బౌలింగ్ విషయానికొస్తే.. భారత పేస్ త్రయం ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తోంది.. బుమ్రా, సిరాజ్ ఆరంభంలోనే వికెట్లు పడగొడుతూ అపోజిట్ టీమ్ ను కంగారెత్తిసున్నారు. ఇక లేట్ గా వచ్చినా.. సంచలనాలు సృష్టిస్తున్నాడు మహ్మద్ షమీ.. మిడిల్ ఓవర్లలో స్పిన్‌తో కుల్దీప్, జడేజా రాణిస్తుండటంతో ఫైనల్ మ్యాచ్‌లోనూ భారత్ ఘన విజయం సాధించడం ఖాయమని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ చెప్తున్నారు..