గబ్బాలో ఆసీస్ ను అబ్బా అనిపించిన టీమిండియా!

టీమిండియా సంచలనం.. ఆస్ట్రేలియా గడ్డపై రికార్డు లక్ష్యాన్ని అలవోకగా చేదించి సిరీస్ కైవసం.

Update: 2021-01-19 08:56 GMT

ఆస్ట్రేలియాలో సంచలనం సృష్టించిన టీమిండియా 

ఒక్క దెబ్బ రెండు పిట్టలు.. ఒక్క మ్యాచ్ విజయంతో సిరీస్ ను కూడా ఒడిసి పట్టి టీమిండియా ఘనంగా ఆస్ట్రేలియా టూర్ ముగించింది. కళ్ళు చెదిరే యువ బ్యాట్స్ మెన్ విన్యాసాలతో సగర్వంగా గవాస్కర్-బోర్డర్ ట్రోఫీని ముద్దాడింది టీమిండియా.

ఒక వరల్డ్ కప్ గెలిస్తే ఎంత సంబర పడాలో దానికి పదింతలు సంబరపడాల్సిన చిరస్మరణీయ విజయాన్ని సాధించారు భారత కుర్రోళ్ళు. కోహ్లే గైర్హాజరీలో.. రెండో టెస్ట్ లో రహానే సారధ్యంలో గెలుపు అందుకున్న టీమిండియా జోరు ఏమాత్రం తగ్గనీయలేదు. మూడో మ్యాచ్ లో ఓటమి కోరల నుంచి డ్రా తో గట్టేక్కించిన యువ క్రికెటర్లు.. సిరీస్ ను సజీవంగా ఉంచారు. ఆ దారిలోనే నాలుగో టెస్ట్ లో అద్భుత విజయాన్ని అందుకున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా నిర్దేశించిన 327 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివర్లో రిషభ్‌ పంత్‌ (89నాటౌట్‌; 138 బంతుల్లో 9x4, 1x6), వాషింగ్టన్‌ సుందర్‌(22) కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయం అందించారు.

మొత్తమ్మీద భారత జట్టు రికార్డును నెలకొల్పింది ఈ విజయంతో. సీనియర్ ఆటగాళ్ళు చేతులెత్తేసిన పరిస్థితిలో మొదటి ఇన్నింగ్స్ లో చెప్పుకోదగ్గ స్కోరు చేసి ఆసీస్ కు చుక్కలు చూపెట్టిన యువ బ్యాట్స్ మెన్ రెండో ఇన్నింగ్స్ లో అతి క్లిష్టమైన 327 పరుగుల చేదనను సుసాధ్యం చేసి విజయ లక్ష్యాన్ని చేరుకున్నారు.

ఈ మ్యాచ్ విజయంతో గవాస్కర్-బోర్డర్ ట్రోఫీని గెలిచినా భారత్ జట్టు .. ఇది వరుసగా రెండో సారి ట్రోఫీ గెలిచినట్టయింది.


Tags:    

Similar News