India vs Engalnd T20: తలనొప్పిలా మారిన తుది ఎంపిక

India vs Engalnd T20: ఇంగ్లండ్‌తో ఈనెల 12 నుంచి ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌ కోసం టీమిండియా మల్లగుల్లాలు పడుతోంది.

Update: 2021-03-08 16:28 GMT
టీం ఇండియా (ఫొటో ట్విట్టర్)

India vs Engalnd T20: ఇంగ్లండ్‌తో ఈనెల 12 నుంచి ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌ కోసం టీమిండియా మల్లగుల్లాలు పడుతోంది. టీమిండియా రిజర్వ్‌ బెంచ్‌ బలంగా ఉండటంతో తుది జట్టు ఎంపిక తలనొప్పిలా మారింది. ఒక్కో స్థానం కోసం ఇద్దరు పోటీ పడుతుండడంతో పరిస్థితికి అద్దం పడుతోంది. ఓపెనింగ్‌ స్థానం కోసం శిఖర్‌ ధవన్‌, లోకేశ్‌ రాహుల్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. అలాగే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసేందుకు శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు పోటీ పడుతున్నారు.

ఇక జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్‌ కిషన్‌, రాహుల్‌ తెవాటీయాల ను ఏ స్థానంలో ఆడించాలో తెలియడం లేదు. యువ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషభ్ పంత్‌ ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్ లో అదరగొట్టడంతో టాప్‌‌, మిడిలార్డర్లో మార్పులు ఖచ్చితమే తెలస్తోంది. ముఖ్యంగా కేఎల్‌ రాహుల్‌, పంత్‌ లలో కీపింగ్ భాద్యతలు ఎవరికి ఇవ్వాలో కూడా సందిగ్ధంలో పడేసింది.

ఇక ఆల్‌రౌండర్‌ విభాగంలో హార్ధిక్‌ పాండ్య ప్లేస్‌ సేఫ్ జోన్ లో ఉన్నప్పటికీ..అక్షర​ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌ లు ఇంగ్లాండ్ సిరీస్ లో దుమ్ము దులపడంతో పోటీ ఎక్కువైంది.

బౌలింగ్‌ విభాగంలో కూడా ఒక్కో స్థానం కోసం ఇద్దరు ముగ్గురు పోటీపడుతుండటంతో ఏం చెయ్యాలో అర్ధం కాక టీం మేనేజ్‌మెంట్ తలలు పట్టుకుంటుంది. పేసర్లలో దీపక్‌ చాహర్‌, నటరాజన్‌, నవదీప్‌ సైనీ, శార్ధూల్‌ ఠాకూర్‌, భువనేశ్వర్‌ కుమార్‌ల మధ్య పోటీ తీవ్రంగా నెలకొంది. తుది జట్టు ఎంపిక కెప్టెన్‌ కోహ్లి, కోచ్‌ రవిశాస్త్రికి గందరగోళంగా తయారైంది. కాగా అన్ని మ్యాచ్‌లు మొతేరా వేదికగానే జరగనున్నాయి.

Tags:    

Similar News